← Back to news

AI అభివృద్ధిపై టెక్ దిగ్గజాలతో చర్చలు

By A.Ajay· 53m ago
AI అభివృద్ధిపై టెక్ దిగ్గజాలతో చర్చలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో టెక్ కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు. AI అభివృద్ధి, భద్రతపై చర్చించిన అనంతరం కంపెనీలు స్వచ్ఛంద భద్రతా ఒప్పందానికి అంగీకరించాయి. AI వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు సంస్థల్లో ప్రత్యేక బృందాలు, స్వతంత్ర ఆడిటర్ల పర్యవేక్షణ ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. AI టూల్స్ అనుమతి లేని సైబర్ దాడులు చేయకుండా నియంత్రణలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపెన్‌ఏఐ, గూగుల్, మెటా, ఎన్విడియా, ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

More in International