గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో పద్మశాలీయ బహుజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి సంఘం ప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి గాంధీజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస, శాంతి మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.



