అంగన్వాడీ కేంద్రాల్లో ‘అంగన్ మిలన్’ కార్యక్రమం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడీ సేవా ఉత్సవం నిర్వహించారు. ‘అంగన్ మిలన్’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించినట్లు నాయకులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషకాహారం అందించడంతో పాటు చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. గర్భిణుల ఆరోగ్యం, చిన్నారుల పోషణ, టీకాలు, కౌమార బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు.



