సిద్దాపూర్‌లో డంపింగ్ యార్డుపై నిరసన

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ SDVP జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. GO 641 జారీ చేసి 90 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు JAC నేతలు తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. తొలిరోజు నవయువతకు చెందిన పలువురు దీక్షలో కూర్చున్నారు. JAC నేతలు రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్ పాల్గొన్నారు.


