ఎన్నికల అధికారికి కర్ణాటక CM D.K.శివకుమార్ లేఖ

రాష్ట్ర ఎన్నికల అధికారికి కర్ణాటక CM D.K.శివకుమార్ లేఖ రాశారు. ఫామ్ 7 అభ్యంతరాలపై వెంటనే విచారణ చేయాలని కోరారు. ముదిగెరెలో 6,259, బెలగావి నార్త్‌లో సుమారు 3,000, భల్కీలో 2,285, బబళేశ్వర్‌లో 1,373, నరసింహ రాజ్‌లో 1,200 అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చాయన్నారు. తొలగించాలని ప్రతిపాదించిన ఓటర్లలో చాలా మంది మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారనే రిపోర్టులున్నాయని తెలిపారు.
