← Back to news

"ఆ పిల్లలెందుకు చనిపోయారు?".. రాహుల్ ప్రశ్న

By Krishna· 1h ago

మధ్యప్రదేశ్.. బాలాఘాట్ జిల్లా.. జగ్లా గ్రామంలో 43 మంది పిల్లలు ఎందుకు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బైగా ఆదివాసి కుటుంబాలను కలిసిన ఆయన.. పోషకాహార లోపం, మలేరియా, మీజిల్స్ వంటి కారణాలతో ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య ఇంత మంది చనిపోయారని ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు చెయ్యాలనీ, భూమి పట్టాలు ఇవ్వాలనీ, హాస్పిటల్స్, స్కూళ్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసులు దేశ మొదటి యజమానులని రాహుల్ గుర్తు చేశారు.

More in National