ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మోసం.. ఇండియా వచ్చిన ఇటలీ డిజైనర్

ఇటలీకి చెందిన 50 ఏళ్ల జ్యువెలరీ డిజైనర్ పావోలా బెర్టోలిని సైబర్ వలలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి తనను తాను ఫ్యాషన్ డిజైనర్‌గా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గురుగ్రామ్‌లో బొటిక్ వ్యాపారం పెడదామని చెప్పి, ఆమె నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్లకు ఆన్సర్ చేయకపోవడంతో తను మోసపోయానని గ్రహించి, సెప్టెంబర్ 28న ఇటలీ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుని కంప్లైంట్ చేశారు.
