Latest
ఉత్తరప్రదేశ్‌లో మరో Gen Alpha ఉద్యమం!
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా స్మిత్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. 'కెమిస్ట్రీ సార్ లేకపోతే మా భవిష్యత్తు ఆసిడ్‌లా మండిపోతుంది' అని రాసి ఉన్న ప్లకార్డులతో పాఠశాల ముందు ధర్నాకు కూర్చున్నారు. స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రీల్స్ కోసం రోడ్డుపై ఫైట్.. వీడియో వైరల్!
బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ విషయంలో తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ జుట్టు పట్టుకున్నారు. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఫైట్ జరగడంతో కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గొడవకు అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. చివరకు అక్కడున్నవారు ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
విద్యార్థినులను వేధిస్తున్న లెక్చరర్!
TG : నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నాడని లెక్చరర్ భాస్కర్‌ను ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) కార్యకర్తలు కొట్టారు. ఈ విషయం తెలుసుకుని కాలేజీ ముందు ఆందోళన చేపట్టిన ABVP నాయకులు, ఆ లెక్చరర్‌కు బుద్ధి చెప్పారు. అతనిపై వెంటనే పోక్సో (POCSO) కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రిషభ్ పంత్ హిస్టారిక్ రికార్డ్!
టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 66 రన్స్ చేసే క్రమంలో రెండు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించాడు. దీంతో సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88)లను వెనక్కి నెట్టాడు. అత్యంత వేగంగా 51 టెస్టుల్లోనే ఈ మార్క్ చేరుకోగా, ప్రపంచ స్థాయిలో ఈ ఘనత సాధించిన నాల్గో ప్లేయర్‌గా నిలిచాడు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 (LBO) వేకెన్సీస్
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2026లో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు <a href="https://bankofbaroda.bank.in/career/current-opportunities/recruitment-of-local-bank-officers-on-regular-basis-07-09">నోటిఫికేషన్</a> విడుదల చేసింది. ఇందులో 1,300 ఫ్రెషర్స్, 1,182 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసి, 21–30 ఏళ్ల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 7, 2026 వరకు <a href="https://bankofbaroda.bank.in/career/current-opportunities">ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు</a> స్వీకరిస్తారు. ఎంపిక ఆన్‌లైన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. SC/STలకు రూ.175, OBC/EWS అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

బరువు తగ్గడం కాదు.. శక్తి పెరగడమే ముఖ్యం!
ఆడవాళ్లు ఇప్పుడు కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా శరీరంలో శక్తి, బలాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫుడ్ తగ్గించి క్యాలరీలు తగ్గించుకోవడం వల్ల నీరసం, అలసట, హార్మోన్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తినడం, శరీరంలో విటమిన్లు తగ్గకుండా చూసుకోవడం, వర్కౌట్స్‌తో పాటు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. 'బరువు పెరిగారా లేదా అన్నది కాదు.. ఎంత ఉత్సాహంగా, బలంగా ఉన్నారనేదే అసలైన ఆరోగ్యం' అని అంటున్నారు.

పాలిటెక్నిక్‌లను అనుసంధానం చేయొద్దని MLAకు వినతి
TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అందిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి పీపీపీ విధానం తీసుకురావడం ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఫైర్
TG: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీపీఎం మద్దతు తెలిపింది. హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఖాళీ పోస్టులను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసింది. శంషాబాద్‌లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బచ్చలకూర స్వామి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు.

యూట్యూబ్ వ్యూస్‌లో బిగ్ చేంజ్!
ఆగస్టు 24 నుంచి యూట్యూబ్ వ్యూస్ కౌంటింగ్ విధానాన్ని మార్చనుంది. ఇక వీడియో ప్లే అవ్వగానే ఒక వ్యూ కౌంట్ అవుతుంది. రీవాచ్ చేసినా వ్యూ యాడ్ అవుతుంది. అయితే మానిటైజేషన్ రూల్స్‌లో మార్పు లేదు. క్రియేటర్ల ఎర్నింగ్స్, YPP ఎలిజిబిలిటీకి ఎంగేజ్డ్ షార్ట్స్ వ్యూస్, వాచ్ అవర్స్‌నే కొనసాగిస్తారు. యూట్యూబ్ అనలిటిక్స్‌లో ‘ఎంగేజ్డ్ వ్యూస్’ ప్రత్యేకంగా కనిపిస్తాయి. దీంతో పబ్లిక్ వ్యూ కౌంట్ పెరిగినా, వాచ్ టైమ్, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌నే కంటెంట్ పనితీరుకు కీలకంగా ఉంటాయి.

ఇల్లు ప్రశాంతంగా ఉంటే.. మనస్సు కుదుటపడుతుంది!
మనం ఉండే గది మన నరాల వ్యవస్థను, మనస్సును ప్రశాంతంగా మార్చగలదని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు అందంగా ఉండటమే కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చేలా ఉండాలి. పగటిపూట మంచి వెలుతురు, రాత్రివేళ డిమ్ లైట్లు వాడటం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. గదిలో అనవసర శబ్దాలు లేకుండా కర్టెన్లు, కార్పెట్లు వాడటం మంచిది. అలాగే గదిలో పచ్చని మొక్కలు, సహజమైన గాలి, తక్కువ వస్తువులు ఉంటే ఒత్తిడి తగ్గి మనస్సు తేలికపడుతుందని అంటున్నారు.

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్రను అడ్డుకోవాలి: సండ్ర
TG: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు
TG: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం ఘంపూర్ గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లతో చేపడుతున్న తాగునీటి సరఫరా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

బహుజనుల కోసం పోరాడిన వీరుడు పాపన్న గౌడ్
TG: గద్వాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గద్వాల గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడిగా ఆయనను గుర్తుచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలతో 17వ శతాబ్దంలోనే గోల్కొండ కోటపై బడుగుల ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన ధీరుడని పేర్కొన్నారు.

కళాశాల ఎదుట SFI నాయకుల ఆందోళన
TG: ప్రైవేట్ కళాశాలల అధిక ఫీజులపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ.. అడ్మిషన్ల సమయంలో ఫీజులు తీసుకోమని చెప్పి, తర్వాత విద్యార్థుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టీసీలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు ఇవ్వకుండా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.

విజయవాడ ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
AP: విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే, వీఎంసీ అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశమయ్యారు. ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీ లు, డ్రైనేజీ, పైప్‌లైన్ సమస్యలపై చర్చించారు. వచ్చే వారంలో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వినుకొండ రోడ్డులోని 'NSB కార్ డెకార్స్'లో వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కారుకు మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఫార్చ్యునర్ కార్లు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. పక్కనే ఉన్న బిరియాని రెస్టారెంట్‌కి సైతం మంటలు వ్యాపించాయి.

గద్దర్‌పై డాక్యుమెంటరీ.. పోస్టర్ రిలీజ్!
ప్రజా యుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. ప్రజా ఉద్యమాలకు గద్దర్ చిరునామాగా నిలిచారని, తన ఆటపాటలతో పీడిత ప్రజల గొంతుకగా కోట్ల మందిని ఉద్యమాల వైపు నడిపించారని కొనియాడారు. గద్దర్‌పై తనకు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ద్వారా ఆయన ఉద్యమ ప్రస్థానం, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రయత్నానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఏపీలో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రిజర్వేషన్ల ఖరారు, చట్టసవరణలు పూర్తిచేసి అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలింగ్ మెటీరియల్ సేకరణకు టెండర్లు నిర్వహించాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ప్రక్రియను సమీక్షిస్తోంది.

కొండగట్టు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు.. పోలీసులకు SP ఆదేశాలు
TG: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు <a href="https://www.theclearcutnews.com/n/MJPz7jK">ప్రమాద</a> స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
TG: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మహబూబ్‌నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డి.కె.అరుణ, మేయర్ గుమ్మల మమతా శ్రీనివాస్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో DCC ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు.

ఇడుపులపాయ ట్రిపుల్ఐటిలో అసోసియేట్ డీన్ అకాడమిక్స్ నియామకం
AP: కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో కొత్త అసోసియేట్ డీన్ అకాడమిక్స్ నియామకం చేపట్టారు. కెమిస్ట్రీ విభాగంలో మెంటర్‌గా ఉన్న డాక్టర్ బి.ఈశ్వర్ నాయక్‌ను పియుసి విద్యార్థులకు, EEE విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న షేక్ ఖాజా హుస్సేన్‌ను ఇంజనీరింగ్ విద్యార్థులకు అసోసియేట్ డీన్ అకాడమిక్స్‌గా నియమించారు. ఈ విషయాన్ని పరిపాలనాధికారి డాక్టర్ పి.రవికుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయ ప్రకాష్ తెలిపారు.