Crime· 25 Aug 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
AP: శ్రీశైలం ఆలయ దగ్గరలోని సత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 20న ఆటోలో వచ్చిన ఫామిలీ వడ్డెర సత్రంలో రూమ్‌ను బుక్ చేసుకున్నారు. దర్శనం తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు బాత్రూమ్లో, మరో ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మూఢనమ్మకాలా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.