Crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
Crime· 23 Jun 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

హైదరాబాద్ లో మరో పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకీ దొరికిపోయాడు..! సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరసింహ అవినీతికి పాల్పడ్డాడు..! ఒక కేసులో నిందితుడికి బెయిల్ ఒప్పించడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు..! అయితే అంత ఇచ్చుకోలేనని కాస్త తగ్గించాలని కోరినప్పటికీ నరసింహ ససేమిరా అన్నాడు..! దీంతో ముందుగా రూ. యాబై వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది..! అప్పటికే అతన్ని ఏసీబీకి పట్టించాలని డిసైడ్ అయిన నిందితుడి తరపువాళ్ళు ముందస్తు సమాచారంతో పక్కాగా ట్రాప్ చేసి పట్టుకున్నారు.

16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు
Crime· 21 Jun 2026

16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు

TG: మేడ్చల్ జిలా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్‌పల్లికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్, సంతోష దంపతులు ఈ నెల 17న శిర్డీకి వెళ్లారు. దొంగల కన్ను బీరువాలపై పడుతుందని శ్రీనివాస్ 16తులాల బంగారు నగలు, రూ.3లక్షల నగదును బీరువాలో పెట్టకుండా విడివిడిగా దాచిపెట్టాడు. అతని భార్య సంతోష భర్తకు చెప్పకుండా రూ.30వేల నగదును బీరువాలోనే ఉంచేసింది. శిర్డీయాత్ర ముగించుకుని తిరిగి రాగా, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగలు పడినా 16తులాల బంగారం, రూ.3లక్షల నగదు సురక్షితంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపాడు. సంతోష బీరువాలో పెట్టిన 30వేలను దొంగలు దోచుకెళ్లారు.

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
Crime· 21 Jun 2026

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

TG: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు, ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో అద్దెకు ఉంటున్నారు. భార్యాభర్తలకు గొడవ జరగడంతో, స్వాతి ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తాగించి, తాను కూడా తాగింది. స్థానికులు వెంటనే ముగ్గుర్నీ హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరు కుమారులు వేదిక్(7), తనుష్(5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది.

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'
Crime· 21 Jun 2026

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'

TG: మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో ఈ నెల 5న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్(16), మనవరాలు నక్కా ప్రణతి(14) సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రమ్మ పెద్ద కుమార్తె ధనమ్మకు, భర్త శిరీశ్‌కుమార్‌కు ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆర్థికపరమైన గొడవలు జరిగాయి. దీంతో శిరీశ్‌కుమార్, గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!
Crime· 20 Jun 2026

లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!

సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి, జ్యోతి దంపతులు తమ రెండేళ్ల కొడుకు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉంటున్నారు. అయితే జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని టైమ్‌లో ప్రియుడిని ఇంటికి పిలిచేది. వారు కలిసి ఉన్నప్పుడు బాబు ఏడుస్తుండడంతో నవీన్ చిరాకు పడ్డాడు. బాబును చంపేద్దామని నవీన్ అనడంతో జ్యోతి కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి బాబును కిందపడేసి కొట్టి చంపేశారు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించారు. కానీ తండ్రికి డౌట్ రావడంతో 20 రోజుల తర్వాత ఈ నిజం బయటపడింది. ప్రెజెంట్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.

సాయి కృష్ణ లాకప్ డెత్.. హోమ్ మినిస్టర్ అనిత రిజైన్ చేయాల్సిందే!
Crime· 20 Jun 2026

సాయి కృష్ణ లాకప్ డెత్.. హోమ్ మినిస్టర్ అనిత రిజైన్ చేయాల్సిందే!

సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ ఇప్పుడు AP పాలిటిక్స్‌లో ఫుల్ హీట్ పెంచేసింది. దీనికి బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెంటనే తన పోస్ట్‌కి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో YCP లీడర్స్, కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. గవర్నమెంట్ కేర్‌లెస్‌ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. సాయి కృష్ణ ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు వదిలేదే లేదని, అనిత రిజైన్ చేయాల్సిందేనంటూ స్లోగన్స్‌తో తిరుపతిని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ ప్రొటెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్
Crime· 20 Jun 2026

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

AP: తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ APSP మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌, రాజమహేంద్రవరం మహిళా PSలో వంశీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వంశీ తన తండ్రికి ఫోన్‌ చేసి తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.