Crime

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది
Crime· 20 Jun 2026

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సైనీ(30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఫాంహౌస్‌లోకి చిన్న కట్లపాము రావడంతో చేతితో పట్టుకొని మొహిద్దీన్ అందరినీ భయపెట్టాడు. పాము కుడిచేతి వేలును నోటితో గట్టిగా పట్టుకొంది. కరుస్తోందని పక్కనున్నవారు చెప్పినా తనకు ఏంకాదని చెప్పాడు. శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మొహిద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం
Crime· 20 Jun 2026

అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం

TG: రాయదుర్గం ఇండ్ల బస్తీలో నివసించే కంచమీది గోవర్ధన్(23) అదే బస్తీకి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని(21)ని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో కక్ష పెట్టుకున్నాడు. విద్యార్థిని కుటుంబం తమ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటోంది. అతడు తెల్లవారుజామున 4 గంటలకు పక్కింటిపైకెక్కి ఆమె ఇంట్లోకి కత్తితో వచ్చాడు. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ ఉన్మాదిని పట్టుకుని బంధించి పోలీసులకు అప్పగించారు. జులాయిగా తిరిగే నిందితుడు అమెజాన్‌లో కత్తి తెప్పించుకున్నాడని, హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?
Crime· 19 Jun 2026

కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సడన్‌గా కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు, ఇప్పటికే మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (june 22) రోజు అల్లు అర్జున్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాలని ఆర్డర్ వేశారు. పుష్పా 2 ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కేసు ఇప్పుడు ఈ కోర్టు నోటీసులతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ
Crime· 18 Jun 2026

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను 2019 జూన్ 12 నుంచి స్థానికంగా ఓ ప్లేస్కూల్‌కు పంపించారు. పాఠశాలలో కరాటే కోచ్‌గా పనిచేసే కిరణ్‌సాయి(24) పాపపై అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మమ్మకు పాప చెప్పింది. ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్లేస్కూల్ ప్రిన్సిపల్ దీపిక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. కేసును విచారించిన రాజేంద్రనగర్ పోక్సో కోర్టు నిందితుడు కిరణ్‌సాయికి 20ఏళ్ల జైలుశిక్ష, ప్రిన్సిపల్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.