Latest

విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్
Local· 18 Aug 2026

విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్

TG: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న పి. వెంకటేష్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ విధుల్లో భాగంగా బొగ్గరం గ్రామ పరిధిలోని పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫ్యూజ్ సేకరణ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

అయోధ్య రామ్‌మందిర్ కేసులో కీలక మలుపు!
National· 18 Aug 2026

అయోధ్య రామ్‌మందిర్ కేసులో కీలక మలుపు!

అయోధ్య రామమందిరం విరాళాల దొంగతనం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌ను ఉత్తరప్రదేశ్ హోం డిపార్ట్మెంట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి అందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే, జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ త్రీ-మెంబర్ SITని ఏర్పాటు చేసింది. ఇక ఈ నివేదిక ఆధారంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి
Local· 18 Aug 2026

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

AP: పల్నాడు జిల్లా నుకొండలో APUWJ 70వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, వృత్తిపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.

ఫ్యాక్టరీ వద్దంటూ సచివాలయం ఎదుట బైఠాయింపు
Local· 18 Aug 2026

ఫ్యాక్టరీ వద్దంటూ సచివాలయం ఎదుట బైఠాయింపు

AP: NTR జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న శ్రీసాయిరామ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీకి గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం సుమారు 70శాతం పూర్తవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం గ్రామసభలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రూ.700 ట్రిప్‌కు రూ.600 పార్కింగ్ ఏంటని? డ్రైవర్ ఆగ్రహం
AP· 18 Aug 2026

రూ.700 ట్రిప్‌కు రూ.600 పార్కింగ్ ఏంటని? డ్రైవర్ ఆగ్రహం

AP: భోగాపురం ఎయిర్‌ పోర్టులో కమర్షియల్ ట్యాక్స్, వెయిటింగ్ ఛార్జీల వసూలుపై క్యాబ్ డ్రైవర్ సిబ్బందిని నిలదీశారు. తన ట్రిప్ ఛార్జీ రూ.700 కాగా, పార్కింగ్‌కే రూ.600 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి నిబంధనలు కావని, దారుణం, అన్యాయమంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని సిబ్బంది స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు వాహనం కదపనని డ్రైవర్ తేల్చిచెప్పారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Current Affairs· 18 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో జియోపాలిటిక్స్ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి రూ.1,55,890 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,42,900కి చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, బై చేసే ముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్.

ఝార్ఖండ్‌లో విద్యార్థుల గెలుపు.. సగం డిమాండ్లకు పరిష్కారం!
National· 18 Aug 2026

ఝార్ఖండ్‌లో విద్యార్థుల గెలుపు.. సగం డిమాండ్లకు పరిష్కారం!

ఝార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ పరీక్షల అవకతవకలపై స్టూడెంట్స్ నిరసనలకు ప్రభుత్వం స్పందించింది. JSSC-CGL పరీక్షను రద్దు చేయడంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ TDPL నిర్వహించిన 2014 నుంచి అన్ని పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల కోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడంతో విద్యార్థుల కొన్ని డిమాండ్లు నెరవేరాయి. అయితే అన్ని డిమాండ్లు పూర్తిగా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా అవకతవకలపై CBIతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ అంశంపై విద్యార్థుల అసంతృప్తి కొనసాగుతోంది.

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి
Local· 18 Aug 2026

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి

AP: నంద్యాల జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామపంచాయతీ పరిధిలోని చీమలతిప్ప తాండాకు చెందిన గిరిజనులు తమ భూముల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. 2006లో తమకు మంజూరైన పట్టాలకు సంబంధించి సర్వే నిర్వహించి, ఆన్‌లైన్‌లో నమోదు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి సంజామల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు పట్టాలు మంజూరైనా ఇప్పటివరకు సర్వే, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యలపై బిగ్ డిమాండ్.. RDOకు వినతి
Local· 18 Aug 2026

జర్నలిస్టుల సమస్యలపై బిగ్ డిమాండ్.. RDOకు వినతి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్యులు సేవలు అందించారు. సన్‌రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో ఎం.వి. రమణకు వినతిపత్రం అందజేశారు.

DSCపై శాసనమండలిలో YSRCP నిరసనలు
AP· 18 Aug 2026

DSCపై శాసనమండలిలో YSRCP నిరసనలు

AP: శాసనమండలి రెండో రోజు సమావేశాలు DSC అంశంపై వాడీవేడిగా సాగాయి. DSCపై YSRCP సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు రిజెక్ట్ చేశారు. MLCలు నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిరసనకు దిగారు. బల్లలు చరుస్తూ ఆందోళన చేశారు. DSCపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత BACకి పిలుస్తామని చైర్మన్ చెప్పినా, వెంటనే చర్చ చేపట్టాలని బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

అయోధ్యలో కోతుల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు
Local· 18 Aug 2026

అయోధ్యలో కోతుల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

TG: మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన దైద సాయి అనే ఆరేళ్ల బాలుడు బయట ఆడుకునేందుకు వెళ్తుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేసినట్లు తెలిపారు. బాలుడిని కరిచి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా కోతుల దాడులు పెరిగాయని, ఇప్పటికే పలువురు గాయపడినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు.

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
Local· 18 Aug 2026

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

AP: NTR జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం చంద్రాల భూనిర్వాసితులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 2016లో రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపిస్తూ వారు పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చంద్రాల భూ నిర్వాసితులను రైతు భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం మైలవరం తహసీల్దార్ అబ్దుల్ దరియా, ఎస్‌ఐ సుధాకర్ సమక్షంలో ఆర్డీవో నిర్వాసితులతో చర్చలు నిర్వహించారు.

గిగ్ కార్మికుల సమస్యలపై బిగ్ ఫైట్.. పురాణాపూల్‌లో ధర్నా
Local· 18 Aug 2026

గిగ్ కార్మికుల సమస్యలపై బిగ్ ఫైట్.. పురాణాపూల్‌లో ధర్నా

TG: హైదరాబాద్ పురాణాపూల్ చౌరస్తాలో రాపిడో, ఉబర్, గిగ్ వర్కర్లకు మద్దతుగా ఇంక్విలాబ్ సేనా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల అధ్యక్షులతోపాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయబాబు, రాజేష్ ముదిరాజ్, ప్రవీణ్, గోపీనాథ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వెల్లంపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్య
Local· 18 Aug 2026

వెల్లంపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్య

AP: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి సమీపంలో శ్రీదేవి (35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా ఆమె వెల్లంపల్లి గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. ఘటనాస్థలంలో ఆమె పక్కనే ఉన్న రాయిపై రక్తపు మరకలు కనిపించడంతో.. అదే రాయితో కొట్టి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్లీపర్ బస్సు ప్రమాదాలు, టికెట్లపై అసెంబ్లీలో చర్చ!
AP· 18 Aug 2026

స్లీపర్ బస్సు ప్రమాదాలు, టికెట్లపై అసెంబ్లీలో చర్చ!

AP: అసెంబ్లీలో స్లీపర్ బస్సు ప్రమాదాల అంశంపై MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రమాదాలను అరికట్టేందుకు బస్సుల ఫిట్‌నెస్‌తో పాటు డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను కూడా తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదాలకు కారణమయ్యే వారిపై నార్మల్ యాక్సిడెంట్ కేసులకు కాకుండా పీడీ యాక్టులు పెట్టాలని కోరారు. టికెట్ల బుకింగ్‌కు ప్రైవేట్ సైట్లకు బదులుగా ఆర్టీసీ సైట్‌ను ప్రోత్సహించాలని MLA శ్రీధర్‌రెడ్డి సూచించారు. ఫిట్‌నెస్‌లో లోపాలుంటే బస్సులను సీజ్ చేస్తామని మంత్రి రాంప్రసాద్ హామీ ఇచ్చారు.

BJPకి సోషల్ మీడియా కొత్త చీఫ్ దీపక్ మ్హస్కే!
Current Affairs· 18 Aug 2026

BJPకి సోషల్ మీడియా కొత్త చీఫ్ దీపక్ మ్హస్కే!

BJP SM హెడ్ గా 2015 నుంచి ఉన్న అమిత్ మాలవ్య స్థానంలో దీపక్ మ్హస్కేని నియమించింది. కొత్త BJP అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన మొదటి రీప్లేస్మెంట్ ఇది. దీపక్ ఛత్తీస్గఢ్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఆ రాష్ట్ర IT సెల్ హెడ్‌గా పని చేశారు. విద్యార్థుల ప్రొటెస్టుల తర్వాత ఈ మార్పు చెయ్యడం గమనించాలి. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం అని నబీన్ అన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన దీపక్ గతంలో కాలేజీ లెక్చరర్. M.Sc Chemistry చదివారు. BJPలో ఇతనికి డేటా అనాలిసిస్, ఎన్నికల స్ట్రాటజీ expert గా పేరుంది.

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ
Local· 18 Aug 2026

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ బంగారు హారం సమర్పించారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు 463.920 గ్రాముల బంగారు హారాన్ని ఆలయానికి బహూకరించారు. దీని విలువ సుమారు రూ.71.94 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దాత కుటుంబసభ్యులు బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు.

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట
Local· 18 Aug 2026

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని GMR కేర్ సెంటర్ సమీపంలో ఉన్న మద్యం దుకాణం ఎదురుగా రెండు కిరాణా దుకాణాల యజమానులు పరస్పరం గొడవపడి దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం
Local· 18 Aug 2026

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం

TG: హైదరాబాద్ KPHB కాలనీ పవర్ స్టేషన్‌కు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కింద కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు అత్యంత సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే వ్యాపారులతో పాటు అక్కడికి వచ్చే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
Infotainment· 18 Aug 2026

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!

ఓటర్లు తమ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఆన్‌లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం <a href="https://www.eci.gov.in/">Election Commission</a> ఓటర్ పోర్టల్‌లోని ‘Electoral Roll Download’ విభాగంలోకి వెళ్లాలి. 2026 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి మీ పార్ట్ నంబర్, పార్ట్ పేరును సెలెక్ట్ చేయాలి. ‘Download Selected PDFs’పై క్లిక్ చేస్తే ఓటర్ల లిస్ట్ PDF డౌన్‌లోడ్ అవుతుంది. అందులో మీ పేరు, ఓటర్ వివరాలను చూసుకోవచ్చు.

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్
Local· 18 Aug 2026

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రౌడీషీటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ నవీన్ కుమార్ స్థానిక రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించిన రౌడీషీటర్ రౌతు తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రౌతు తేజపై గతంలో నాలుగు కేసులు ఉన్నట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.