Latest

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ
Local· 18 Aug 2026

వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ బంగారు హారం సమర్పించారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు 463.920 గ్రాముల బంగారు హారాన్ని ఆలయానికి బహూకరించారు. దీని విలువ సుమారు రూ.71.94 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దాత కుటుంబసభ్యులు బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు.

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట
Local· 18 Aug 2026

రాజాంలో కిరాణా షాపుల యజమానుల కొట్లాట

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని GMR కేర్ సెంటర్ సమీపంలో ఉన్న మద్యం దుకాణం ఎదురుగా రెండు కిరాణా దుకాణాల యజమానులు పరస్పరం గొడవపడి దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం
Local· 18 Aug 2026

పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం

TG: హైదరాబాద్ KPHB కాలనీ పవర్ స్టేషన్‌కు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కింద కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు అత్యంత సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే వ్యాపారులతో పాటు అక్కడికి వచ్చే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
Infotainment· 18 Aug 2026

SIR డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!

ఓటర్లు తమ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఆన్‌లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం <a href="https://www.eci.gov.in/">Election Commission</a> ఓటర్ పోర్టల్‌లోని ‘Electoral Roll Download’ విభాగంలోకి వెళ్లాలి. 2026 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి మీ పార్ట్ నంబర్, పార్ట్ పేరును సెలెక్ట్ చేయాలి. ‘Download Selected PDFs’పై క్లిక్ చేస్తే ఓటర్ల లిస్ట్ PDF డౌన్‌లోడ్ అవుతుంది. అందులో మీ పేరు, ఓటర్ వివరాలను చూసుకోవచ్చు.

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్
Local· 18 Aug 2026

వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రౌడీషీటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ నవీన్ కుమార్ స్థానిక రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించిన రౌడీషీటర్ రౌతు తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రౌతు తేజపై గతంలో నాలుగు కేసులు ఉన్నట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

కీబోర్డ్‌లో ABCD క్రమంలో అక్షరాలు ఎందుకు ఉండవు..? ⌨️
Technology· 18 Aug 2026

కీబోర్డ్‌లో ABCD క్రమంలో అక్షరాలు ఎందుకు ఉండవు..? ⌨️

మన కీబోర్డ్‌లో అక్షరాలు ABCD క్రమంలో కాకుండా QWERTYగా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని కథ టైప్‌రైటర్ కాలం నుంచే మొదలైంది. మొదటి టైప్‌రైటర్లలో అక్షరాలు దాదాపు ఆల్ఫాబెటికల్ క్రమంలోనే ఉండేవి. తర్వాత కీబోర్డ్ లేఅవుట్‌లో మార్పులు చేశారు. టైప్‌రైటర్ మెకానిజంలో సమస్యలు తగ్గించడం, టెలిగ్రాఫ్ ఆపరేటర్లు సందేశాలను వేగంగా టైప్ చేయడం వంటి కారణాలు QWERTY రూపకల్పనలో ప్రభావం చూపినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. చివరికి ఇదే లేఅవుట్ ప్రాచుర్యం పొంది.. మన కంప్యూటర్లు, ఫోన్లలోనూ కొనసాగింది.

స్కూల్‌కు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత
Local· 18 Aug 2026

స్కూల్‌కు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు దాతలు రూ.20 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంను అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన రితిక్, సతీష్ ఈ క్రీడా దుస్తులను వితరణ చేశారు. దాతలను HM షేక్ అబ్దుల్, ఉపాధ్యాయుడు రఘువీర్ పాఠశాల తరఫున సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ప్రగత్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు రూ.5 వేల విరాళం అందించారు.

పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది
National· 18 Aug 2026

పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భీండ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్–భీండ్ నేషనల్ హైవేపై ఛిమ్కా గ్రామం దగ్గరలో కూలీలతో వెళ్తున్న పికప్ వెహికల్ ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. గ్వాలియర్‌లో వరి నాట్లు పనులు ముగించుకుని ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించేందుకు డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
Local· 18 Aug 2026

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

TG: హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో అర్హతలు లేని కొందరు వ్యక్తులు RMPల పేరుతో వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన వైద్యపరీక్షలు చేయకుండానే అధిక మోతాదులో మందులు సూచిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటి నొప్పితో వచ్చిన ఓ వ్యక్తికి నిమెసులైడ్, డైక్లోఫెనాక్ సోడియం వంటి పెయిన్‌కిల్లర్లతో పాటు సెట్రిజిన్‌ను అధిక మోతాదులో తీసుకోవాలని సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు ఉపయోగించిన సూదులను తిరిగి వినియోగిస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ హాస్పిటల్‌కు ప్రొ. జయశంకర్ పేరు.. విజ్ఞప్తి చేసిన మంత్రి
TG· 18 Aug 2026

ఆ హాస్పిటల్‌కు ప్రొ. జయశంకర్ పేరు.. విజ్ఞప్తి చేసిన మంత్రి

TG: సనత్‌నగర్ TIMS హాస్పిటల్‌కు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. నిర్మాణంలో ఉన్న అల్వాల్ TIMSకు మాజీ సీఎం టి.అంజయ్య పేరు పెట్టాలని కోరారు. అలాగే ఎల్‌బీనగర్ TIMSకు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

వికలాంగుడికి ఇల్లు నిర్మించి ఇస్తా: యాదగిరి గౌడ్
Local· 18 Aug 2026

వికలాంగుడికి ఇల్లు నిర్మించి ఇస్తా: యాదగిరి గౌడ్

TG: యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన వికలాంగుడు సింగారం రమేష్‌కు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి మానవతా దృక్పథంతో స్పందించారు. బీర్ల ఫౌండేషన్ సహకారంతో రమేష్‌కు ఇల్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించి, అవసరమైన సహకారం అందించి సొంత ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. రమేష్ కుటుంబానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యాదగిరి తెలిపారు.

క్వాంటం కంప్యూటింగ్‌లో AP జోరు.. స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ!
Education· 18 Aug 2026

క్వాంటం కంప్యూటింగ్‌లో AP జోరు.. స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ!

AP: క్వాంటం కంప్యూటింగ్‌లో AP స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. IITలు, IISc జాయింట్ పార్ట్‌నర్‌షిప్‌తో NPTEL నిర్వహించిన నాలుగు వారాల ‘Quantum Algorithms &amp; Qiskit’ కోర్సుకు దేశవ్యాప్తంగా 1,04,220 మంది అప్లై చేసుకోగా, రాష్ట్రం నుంచి 19 వేల మంది హాజరయ్యారు. వారిలో 2,839 మంది అర్హత సాధించారు. నలుగురు గోల్డ్, 14 మంది సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. నూజివీడు RGUKT స్టూడెంట్స్ ఏకంగా 7 సిల్వర్ మెడల్స్ సాధించారు. పతక విజేతలు CM చంద్రబాబును కలిశారు.

JSSC-CGL పరీక్ష రద్దు.. దీక్ష విరమించిన విద్యార్థి నేత
National· 18 Aug 2026

JSSC-CGL పరీక్ష రద్దు.. దీక్ష విరమించిన విద్యార్థి నేత

ఝార్ఖండ్‌లో JSSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష రద్దు కావడంతో దేవేంద్రనాథ్ మహతో తన నిరాహార దీక్షను విరమించారు. పరీక్ష రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్స్ వారాలుగా నిరసనలు చేయడంతో నిన్న రాత్రి CM హేమంత్ సోరెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాంచీలోని సదర్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మహతోను మంత్రులు, MLAలు కలిసి చర్చలు జరిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్ష విరమిస్తున్నట్లు మహతో ప్రకటించారు.

స్కూల్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
Local· 18 Aug 2026

స్కూల్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకరపల్లి, విద్యానగర్ రోడ్లలో పాఠశాలల సమీపంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే, ముగిసే సమయాల్లో విద్యార్థులు, పాఠశాల బస్సులు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

KBR చుట్టూ ఇక ఎలా వెళ్లాలి? పోలీసుల కొత్త ప్లాన్!
Infotainment· 18 Aug 2026

KBR చుట్టూ ఇక ఎలా వెళ్లాలి? పోలీసుల కొత్త ప్లాన్!

TG: హైదరాబాద్‌లోని KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. H-CITI ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.1,090 కోట్లతో రెండు ప్యాకేజీల్లో నిర్మిస్తున్నారు. రెండేళ్ల ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పనులు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వన్‌వే సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. పార్క్ చుట్టూ 13 లేన్‌ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు సైన్‌బోర్డులను గమనిస్తూ లేన్ మార్చుకోవచ్చు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగానికి పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

గుంతలమయంగా నేషనల్ హైవే
Local· 18 Aug 2026

గుంతలమయంగా నేషనల్ హైవే

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి-30 అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేపట్టి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుంతల కారణంగా ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.

కొత్త పంచాయతీ భవనానికి శంకుస్థాపన
Local· 18 Aug 2026

కొత్త పంచాయతీ భవనానికి శంకుస్థాపన

TG: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పుల మల్లేష్, సర్పంచ్ బోరిగామ వెంకటేష్ శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీంకోర్టు వేదికగా CJP బిగ్ స్టెప్
National· 18 Aug 2026

సుప్రీంకోర్టు వేదికగా CJP బిగ్ స్టెప్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు, FIRల ఉపసంహరణ, పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణల నేపథ్యంలో, CJP ప్రతినిధి <a href="https://x.com/SauravDassss/status/2089400426831773742?s=20">సౌరవ్ దాస్</a> కీలక ప్రకటన చేశారు. పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టులో జరిగే విచారణను పరిశీలించిన అనంతరం, సుప్రీంకోర్టు ఆవరణలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీజేపీ చేపట్టిన నిరసనలు, వాటికి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ అంశం, పోలీసుల వ్యవహారశైలిపై తమ వైఖరిని వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

73 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలు ఇవే
TG· 18 Aug 2026

73 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలు ఇవే

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.. సవరణకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదాలో ఆ సంఖ్య 2,64,87,213కు తగ్గింది. ఆచూకీలేని, శాశ్వతంగా వలసవెళ్లిన, మరణించిన, ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగిన వారిగా గుర్తించిన 73,39,235 మంది పేర్లను తొలగించారు. మరో 92,87,577 మంది ఓటర్ల వివరాలపై వ్యత్యాసాలు, మ్యాపింగ్ సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నోటీసులు జారీచేసి సంజాయిషీ కోరనున్నట్లు తెలిపారు.

కస్తూర్బా గాంధీ స్కూల్‌లో కలెక్టర్ సడన్ చెకింగ్
Local· 18 Aug 2026

కస్తూర్బా గాంధీ స్కూల్‌లో కలెక్టర్ సడన్ చెకింగ్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వంటగదిని సందర్శించి కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం తదితర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వాటి గడువు తేదీలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీపై బిగ్ అప్డేట్
TG· 18 Aug 2026

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీపై బిగ్ అప్డేట్

TG: సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నీటి సరఫరా పనులకు టెండర్లు పూర్తయ్యాయని, విద్యుత్‌ పనులు కూడా గడువులోగా పూర్తవుతాయని తెలిపారు.