Latest

నల్లబెల్లిలో పోచమ్మ బోనాల సందడి!
Local· 2d ago

నల్లబెల్లిలో పోచమ్మ బోనాల సందడి!

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాలు సిద్ధం చేసి, ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. బోనాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!
Local· 2d ago

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజుకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ’’పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఆయనే తీసుకొచ్చారు. నాయకులు వస్తారు.. పోతారు.. కానీ వైఎస్ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం!’’ అని ఆయన అన్నారు.

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!
Local· 2d ago

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ బాలిక ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చింతపల్లి గ్రామానికి చెందినది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది? ఇది మానసిక ఒత్తిడా.. లేక వేరే కారణమా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!
Local· 2d ago

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఎల్నినో కారణంగా వాతావరణ మార్పులపై నిమ్మ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మకు ఆశించే ఎర్రనల్లి, ఎండితెగులు, బంకతెగుల నివారణ చర్యలు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్, తెనాలి అధికారి యు.శ్రీనిత్య హాజరయ్యారు. ‘‘వ్యాధులు అంతుచిక్కకపోతే పంటే పూర్తిగా దెబ్బతింటుంది కదా! రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవగాహన సదస్సులకు హాజరు కావాల’’ని వారు చెప్పారు.

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు
Local· 2d ago

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు

భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 420 మీటర్ల బ్యానర్, మానవహారంతో ఆందోళన వ్యక్తం చేశారు. రూ.49 వేల కోట్ల రుణమాఫీకి బదులు రూ.18 వేల కోట్లే చేశారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను దగా చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుట్రపన్నుతున్నాయని ఎద్దేవా చేశారు.

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!
Local· 2d ago

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!

రంగారెడ్డి జిల్లాలో భూముల సర్వే పనులు ముమ్మరం. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తహసిల్దార్లకు క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 611 గ్రామాలకు గాను 108 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. భూభారతి, 22ఏ విషయాల్లో బ్రోకర్లను నమ్మొద్దని రైతులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సరిత పాల్గొన్నారు.

136B డాలర్లు.. రూపాయికి అండగా ఎలా?
National· 2d ago

136B డాలర్లు.. రూపాయికి అండగా ఎలా?

విదేశీ కరెన్సీ భారీగా రావడంతో రూపాయికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. ఆగస్టు 31 నాటికి RBI ప్రత్యేక స్వాప్‌ సదుపాయం ద్వారా 136.38 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులు వచ్చాయి. ఇందులో 127.23 బిలియన్‌ డాలర్లు NRIల డిపాజిట్ల నుంచే వచ్చాయి. బ్యాంకులు ఈ డాలర్లను RBIతో స్వాప్‌ చేసుకోవడంతో కేంద్ర బ్యాంకు చేతిలో విదేశీ కరెన్సీ పెరుగుతుంది. అవసరమైనప్పుడు RBI మార్కెట్‌లో డాలర్లు అమ్మి రూపాయిపై ఒత్తిడిని తగ్గించగలదు. అంటే ఈ నిధులు రూపాయిని ఒక్కసారిగా బలపరచవు.. కానీ అది మరింత పడిపోకుండా RBIకి బలమైన అండగా నిలుస్తాయి.

HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!
Local· 2d ago

HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!

హైదరాబాద్‌లోని బేగంపేట HPS సొసైటీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైందని ఆరోపణ! హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాంటెంప్ట్ నోటీసు జారీ అయింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది.. కానీ ఆ ఆదేశాన్ని పాటించలేదు. అందుకే, తాజాగా సిజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది.

Uberలో భారీ లేఆఫ్స్.. 3,300 మందిపై ఎఫెక్ట్
International· 2d ago

Uberలో భారీ లేఆఫ్స్.. 3,300 మందిపై ఎఫెక్ట్

ప్రముఖ రైడ్ హైలింగ్ సంస్థ ఉబర్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వరల్డ్‌వైడ్‌గా దాదాపు 3,300 మంది ఎంప్లాయీస్‌ను తొలగించనుంది. ఇది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆల్‌మోస్ట్ 10 శాతం. మేనేజ్‌మెంట్ లెవల్స్‌ను తగ్గించి, ఆర్గనైజేషన్‌ను మరింత సింపుల్‌గా, ఫాస్ట్‌గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మేనేజర్ల సంఖ్యను కూడా 20% తగ్గించనుంది. అయితే అందరూ ఉద్యోగాలు కోల్పోరు.. కొందరిని ఇతర రోల్స్‌లోకి షిఫ్ట్ చేయనున్నారు. 2020 కోవిడ్ తర్వాత ఉబర్‌లో ఇదే అతిపెద్ద లేఆఫ్.

గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!
Local· 2d ago

గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 20 నుంచి 23కు పెరుగుతున్నాయ్. గెజిట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్కంలో కమిషనర్ దివిజ సంపతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్త కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బీవీఎస్ ప్రసాద్, కార్యాలయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!
Local· 2d ago

హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి చౌడేశ్వరీ కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ జెండాలతో నిండిపోయాయి. ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్ఈడీ తెరపై పవన్ ప్రసంగాన్ని శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు.

బుగ్గారంలో మండల క్రీడలు.. సెప్టెంబర్ 9 నుంచి!
Local· 2d ago

బుగ్గారంలో మండల క్రీడలు.. సెప్టెంబర్ 9 నుంచి!

జగిత్యాల జిల్లా బుగ్గారంలో క్రీడల సందడి మొదలవ్తోంది. MEO మోహన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈనెల 9న బుగ్గారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో SGF క్రీడలు స్టార్ట్! మొదటి రోజు అండర్-14, 17 బాయ్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలు. 10న అండర్-14, 17 గర్ల్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్. 11న అండర్-14, 17 బాయ్స్, గర్ల్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరుగుతాయి. బుధవారం పీఈటీలు, పీడీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వణుకు వస్తే.. శరీరంలో ఏం జరుగుతుంది?
Education· 2d ago

వణుకు వస్తే.. శరీరంలో ఏం జరుగుతుంది?

చలిలో బయటికి వెళ్లగానే మన శరీరం వణకడం మొదలవుతుంది కదా.. అసలు ఎందుకు వణుకుతామో తెలుసా? శరీరం తన వేడిని కాపాడుకునే సహజ మార్గం ఇది! చలి పెరిగినప్పుడు మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ శరీరం చల్లబడుతోందని గుర్తిస్తుంది. వెంటనే కండరాలు చాలా వేగంగా కుదించుకుని వదులుకోవడం మొదలుపెడతాయి. ఈ చిన్న చిన్న కండరాల కదలికల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే మనకు వణుకు వస్తుంది. అంటే వణకడం బలహీనత కాదు.. శరీరం తన ఉష్ణోగ్రతను నిలబెట్టుకునేందుకు చేస్తున్న సహజ ప్రయత్నం అన్నమాట! ఇలా శరీరం వేడిని తిరిగి పొందుతుంది.

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!
Local· 2d ago

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

ముంబైలోని తెలంగాణ వలస కార్మికుల కోసం ఓ డిమాండ్ వినిపిస్తోంది. బుధవారం ధోబీఘాట్‌లోని సంత్ గాడ్గేబాబా విగ్రహం వద్ద ఉద్యమ నేత బట్టు శ్రీధర్ గంగపుత్ర, రాజు మాదిగ మాట్లాడారు. ’’ముంబైకర్లు రెండు రాష్ట్రాల మధ్య నాన్-లోకల్‌గా మిగిలిపోతున్నారు. ఇది బాధాకరమ‘‘ని శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కె.కె. కమిటీ ప్రతిపాదించిన సౌకర్యాలు ముంబై ఉద్యమకారులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రజక సమాజం, ఎంటిజెఏసి నేతలు కల్లూరి సురేష్, తడ్కపల్లి నరేష్, సిద్దిరాములు, ఎస్.రాజు, భూమేష్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!
Local· 2d ago

ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది. ’’ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు. 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా 5 రాష్ట్రాలకు కోల్ సరఫరా చేస్తుంది. కొన్ని గనులు నష్టాల్లో ఉన్నా.. ఉద్యోగ భద్రత కోసం వాటిని కొనసాగిస్తున్నామ’’ని తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాని సంగతి తెలిసిందే.

దిశా సాలియన్ కేసులో కీలక ట్విస్ట్.. CBIకు అప్పగింత!
National· 2d ago

దిశా సాలియన్ కేసులో కీలక ట్విస్ట్.. CBIకు అప్పగింత!

దిశా సాలియన్ మృతి కేసులో ఆరేళ్ల తర్వాత కీలక అప్‌డేట్ వచ్చింది. 2020లో ముంబైలో ఓ బిల్డింగ్‌పై నుంచి పడి దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు దీన్ని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశారు. దిశా తండ్రి సతీశ్ సాలియన్ తన కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశారని, పూర్తి ఇన్వెస్టిగేషన్ కోరుతూ బాంబే హైకోర్టులో న్యాయం కోరారు. దీంతో సీబీఐ FIR నమోదు చేసి ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇది హత్య జరిగిందనే నిర్ధారణ కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్రలో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది.

లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!
Local· 2d ago

లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో ఓ సంతోష వార్త. అక్షర హైస్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు జాతీయ కురష్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న పంజాబ్‌లోని లుధియానాలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులను ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డైరెక్టర్ దివ్య రామావత్, కరస్పాండెంట్ గంగాధర్, హెడ్‌మాస్టర్ మహేష్ స్టూడెంట్స్‌ను అభినందించారు.

రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!
Local· 2d ago

రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వీరమ్మ కాలవ సమీప హైవేపై ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నారు. కొండమోడు నుంచి నకరికల్లు వైపు వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మీకు ఈ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయండి. ఇలాంటి హఠాత్ మరణం ఎంత బాధాకరమో కదా?

వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!
Local· 2d ago

వైఎస్ వర్ధంతి.. కొత్తగూడెంలో కాంగ్రెస్ నివాళులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. సూర్యా ప్యాలెస్ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వైఎస్ పేదల సంక్షేమానికి పనిచేసిన మహానేత అని కొనియాడారు. 108 ఆరోగ్యశ్రీ, రెండు రూపాయల బియ్యం, పింఛన్లు.. ఇంకా ఎన్నో పథకాలను పేదలకు అందించారన్నారు.

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!
Local· 2d ago

కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి సీజ్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో అశ్వాపురం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒడిశా నుంచి షిర్డీకి కారులో 40.56 కిలోల గంజాయి తరలిస్తున్నారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ గంజాయిని గొల్లగూడెం కెనాల్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిస్సాకు చెందిన దంపతులు అరబిందో బిశ్వాస్, సుప్రియలను అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.