Latest

టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలోని 161 జాతీయ రహదారిపై తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి చేసింది. గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
TG: నల్గొండ జిల్లా నకిరేకల్ టౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు దాడి చేశారు. నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అరెస్ట్ చేశారు. కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు RMPల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నిందితులు ఇద్దరూ చివ్వెంల మండలంలో జరిగిన ఓ గర్భిణి మరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్‌లో వర్గపోరు.. కర్రలు, రాళ్లతో దాడి
TG: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో భువనగిరి MP చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి MLA మందుల సామేల్ వర్గాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికలను ఎమ్మెల్యే సామేల్ ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల వర్గానికి చెందిన నాయకులు ఆరోపించారు. ఆ ఎన్నికలను రద్దు చేయాలని గాంధీభవన్‌కు బయల్దేరారు. అర్వపల్లిలో వారిని ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

భర్త శవం.. లవర్‌తో కార్ జర్నీ!
హైదరాబాద్ మియాపూర్‌లో షాకింగ్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. పెంటేష్(52) అనే వ్యక్తిని అతని రెండో భార్య సత్యవతి, తన లవర్ మధుసూదన్‌తో కలిసి పక్కా ప్లాన్‌తో చంపేసింది. అన్నంలో నిద్రమాత్రలు కలిపి, స్పృహ తప్పాక పిల్లోతో ఊపిరాడకుండా చేసి మర్డర్ చేశారు. ఆపై డెడ్‌బాడీని కార్‌లో మహారాష్ట్ర తీసుకెళ్లి తగలబెట్టారు. ఏమీ తెలియనట్టు మియాపూర్‌లో మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా ఆడారు. కానీ పోలీసులు ఇంటరాగేట్ చేయడంతో ఇద్దరు నిందితులు దొరికిపోయారు. ప్రస్తుతం పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

ఆరు తరాలు కలిసి.. ఆదర్శంగా నిలిచి
AP: మనుషుల మధ్య దూరం పెరుగుతున్న నేటి డిజిటల్ యుగంలో కుటుంబం అంతా కలిసి ఉండడం అంత ఈజీ కాదు. కానీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో హనుమంత రాయుడు, ముత్యాలప్పల రెండు కుటుంబాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెండు కుటుంబాలతో మొదలైన వీరి ప్రస్థానం నేడు ఆరుతరాలకు విస్తరించి ఏకంగా 83మంది సభ్యులతో ఒకే ఇంట్లో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ పెద్దలైన హనుమంత రాయుడు, ముత్యాలప్ప రోజువారీ పనులను పర్యవేక్షిస్తారు. వ్యవసాయం నుంచి వ్యాపారాల వరకు ప్రతిదీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు (బుధవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹770, 22 క్యారెట్లపై ₹700 మేర ధరలు దిగొచ్చాయి. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల ధర ₹1,44,490, 22 క్యారెట్ల ధర ₹1,32,450 గా ఉంది. అయితే మార్కెట్ లో బంగారం ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనేముందు ఒకసారి లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

AI అంటే సర్వర్లు మాత్రమే కాదు
TG: క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే AI కాదు. దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని, దీనిని ప్రభుత్వం గుర్తించిందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి తెలంగాణ AI ప్రమాణాలకు దిక్సూచిగా నిలుస్తోందన్నారు. నీరు, విద్యుత్తును హరిస్తూ AIని నిర్మించడం కాకుండా, పునరుత్పాదక ఇంధనం, వనరులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు.

సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ పొడిగింపు
AP: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్‌ను బాధిత కుటుంబాల విజ్ఞప్తితో అధికారులు పొడిగించారు. రేపు మధ్యాహ్నం 12గంటల వరకు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లి వస్తున్న క్రమంలో సముద్రంలో బోటు గల్లంతు అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఏడుగురు ఉండగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా ఆరుగురు మత్స్యకారుల కోసం ఇప్పటికే 72గంటల పాటు నేవీ, కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టాయి. వారి ఆచూకీ దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చిరుతపులి సంచారం.. కుక్కలతో తప్పిన ప్రమాదం
TG: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లి శివారులో రైతు శ్రవణ్‌కు చెందిన కోళ్ల ఫామ్‌కు వద్దకు వచ్చిన పులి విజువల్స్ CC కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతను చూసి కుక్కలు అరవడంతో వెనుదిరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు అడవికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు
TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి జిల్లా కోర్ట్ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా SP మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో కొత్తపల్లి గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యను, 2022లో కామారెడ్డి జిల్లాకు చెందిన మన్నె నరసింహులును భూవివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, 20 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
AP: విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ సాయం అందించనుంది. చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులు తిరిగి వస్తున్న క్రమంలో ఈ నెల 4న వారి బోటు గల్లంతైంది. బోటులో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఒకరు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఆరుగురు సముద్రంలో గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకలేదు. గల్లెంతైనవారి కోసం కోస్ట్ గార్డ్‌లు, పోలీసులు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

అక్కడ అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాల్సిందే
TG: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఒకే ప్రాంగణంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. రెండు స్కూళ్లకు చెందిన విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారు. ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్‌లో కొత్త భవనాన్ని నిర్మించి బడిని అక్కడికి మార్చారు. కానీ 8ఏళ్లు దాటినా వంటగది నిర్మించలేదు. దీంతో డైలీ 100మందికి పైగా విద్యార్థులు భోజనం కోసం మధ్యాహ్నం దాదాపు 1 KM దూరంలో ఉన్న పాత స్కూల్‌కు ప్లేట్స్ పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ తినేందుకు ప్లేస్ కూడా లేకపోవడంతో భోజనం తీసుకుని తిరిగి కొత్త బడికి వచ్చి తింటున్నారు.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి
TG: హన్మకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్(17) మృతి చెందాడు. ఇటీవల అతడి ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ మృతి చెందాడు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమైన నిరంజన్‌ను గతనెలలో పవన్ పరామర్శించారు. నిరంజన్‌ను కలిసినప్పుడు పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. ‘OG 2' మూవీ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్' అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు.

ఏలియన్స్ కౌన్సిల్ కు ఎంపికైన హర్యానా సైంటిస్ట్ !
హర్యానాకు చెందిన మాజీ జూడో క్రీడాకారుడు, ప్రస్తుత హార్వర్డ్ పరిశోధకుడు డాక్టర్ దేవేష్ నందల్ సరికొత్త ఘనత సాధించారు. అంతరిక్షంలో గ్రహాంతరవాసుల జాడను కనిపెట్టేందుకు హార్వర్డ్ ప్రొఫెసర్ అవి లోబ్ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక UAP సైన్స్ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఆయనకు చోటు దక్కింది. 2006లో హర్యానా జూనియర్ జూడో జట్టులో గోల్డ్ మెడల్ సాధించిన దేవేష్, ఆ తర్వాత సైన్స్ వైపు అడుగులు వేసి ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లలో నైపుణ్యం సాధించారు. ఇప్పుడు ఈ కొత్త కౌన్సిల్ ద్వారా అమెరికా వైట్‌హౌస్, పెంటగాన్, ఎఫ్‌బీఐలకు ఏలియన్స్ వింత పరిణామాలపై సైంటిఫిక్ అనాలిసిస్ అందిస్తారు.

భూపరీక్షలు చేయకుండానే బ్యారేజ్‌లు నిర్మించారు
TG: KCR అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారని CM రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రజాభవన్‌లో మంత్రులు, MLAలు, MLCలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును KCR 2019 జూన్ 21న ప్రారంభించారు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బ్యారేజ్‌లు కట్టారు. కట్టిన వెంటనే 100శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయిందని CM ఫైరయ్యారు.

sober curious ట్రెండింగ్ - డ్రింక్ కు బై !
మద్యం మానేయడం ఆరోగ్య సమస్యల వల్లే కాదు.. ఆసక్తి తగ్గడం వల్ల కూడా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు దూరమైనవారిలో నిద్ర మెరుగవడం, బరువు నియంత్రణ, చర్మ కాంతి పెరగడం, ఫిట్‌నెస్ మెరుగవడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. మహిళల్లో ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది ‘సోబర్ క్యూరియస్’ ట్రెండ్‌ను ఫాలో అవుతూ డ్రింక్ లేకుండానే పార్టీలు, సోషల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు ఈ ఇంజెక్షన్ వరం !
కీళ్ళనొప్పులతో బాధపడేవారికి అమెరికా పరిశోధకులు తీపి కబురు అందించారు. మోకాళ్ళ అరుగుదలను (ఆస్టియోఆర్థరైటిస్) పూర్తిగా నయం చేసే రెండు సరికొత్త రీజెనరేటివ్ మెథడ్స్ ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఒకే ఒక్క ఇంజెక్షన్ ద్వారా కేవలం 4 నుండి 8 వారాల్లోనే దెబ్బతిన్న కీళ్ళు, ఎముకలు , మృదులాస్థి (కార్టిలేజ్) సాధారణ స్థితికి చేరుకున్నట్లు జంతు ప్రయోగాల్లో తేలింది. వచ్చే ఏడాది ఆఖరున దీనిపై మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

వైద్యసేవలపై ప్రపంచబ్యాంక్ షాకింగ్ రిపోర్ట్
TG: ఆరోగ్యరంగంలో తెలంగాణ గణనీయంగానే అభివృద్ధి చెందింది. కానీ ప్రజారోగ్య వ్యవస్థ మాత్రం ఇంకా అనేక నిర్మాణాత్మక సమస్యలతో సతమతమవుతోందని ప్రపంచబ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో ఆరోగ్య సేవలను ఇంకా మెరుగుపరచాలని నిర్ణయించింది. తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ హెల్త్‌కేర్ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పర్యావరణ, సామాజిక వ్యవస్థల అంచనా నివేదికలో ప్రపంచ బ్యాంక్ ఈ అంశాలను ప్రస్తావించింది. తెలంగాణలోని గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదని వెల్లడించింది.

రూరల్ ఎకానమీకి ఊతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్‌కు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో రైతులను ప్రోత్సహించాలని అధికారులకు CM సూచించారు. రూరల్ ఎకానమీని బలోపేతం చేసేలా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఇంధనానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలని సూచించారు.

ఫేస్ లో గ్లో కావాలా? అయితే ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి!
ఫేస్ గ్లోయింగ్ గా, అందంగా కనిపించాలంటే కేవలం కాస్మెటిక్స్ వాడితే సరిపోదు, డైలీ వర్కవుట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, స్కిన్ లోని టాక్సిన్స్ (వ్యర్థాలు) బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల ఫేస్ లో ఒక నేచురల్ గ్లో వస్తుంది. కాబట్టి రోజూ పొద్దున్నే లేచి కాసేపు వర్కవుట్ చేయడం అలవాటు చేసుకోండి.

సీపీఐ(ఎం) మహిళా నేతపై కోడిగుడ్లతో దాడి
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై జరిగిన కోడిగుడ్ల దాడి ఇప్పుడు సీపీఐ(ఎం) నేత మీనాక్షి ముఖర్జీపై కూడా జరిగింది. మే 4న అధికారం నుంచి తొలగించబడిన తర్వాత అభిషేక్ బెనర్జీ, మహువా మొయిత్రా, మదన్ మిత్రా, కునాల్ ఘోష్ వంటి తృణమూల్ నేతలపై గుడ్ల దాడి జరిగింది. ఇది సీపీఐ(ఎం) నేతపై జరిగిన మొదటి ఘటన.