Latest

CEIR ఎఫెక్ట్.. ఆటోలో పోయిన ఫోన్ ఇలా వచ్చింది!
జగిత్యాల జిల్లా ధర్మారంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్షెట్టిపేట మండలం గుల్లకోటకు చెందిన సాగే ప్రేమలతకు మే నెలలో ఫోన్ పోయింది. కానీ CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా ఫోన్‌ను రికవరీ చేశారు. గురువారం ధర్మారం ఎస్ఐ ఈ.శ్రీకాంత్ ఆమెకు ఫోన్ అప్పగించారు. ఇక CEIR ఉందంటే పోయిన ఫోన్ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందని ఈ కేసు రుజువు చేస్తోంది.

మా కాలేజీకి 3 రోజులేనా? 6 రోజుల రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి!
నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూపు స్టూడెంట్స్‌కు బోటనీ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా మారింది. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నా.. వారానికి 3 రోజులు మాత్రమే తాత్కాలిక లెక్చరర్ రావడంతో చదువు నిలిచిపోయే పరిస్థితి. అధికారులు చేసిన ఈ తాత్కాలిక ఏర్పాటు సరిపోదని డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం చెబుతోంది. పూర్తిస్థాయి రెగ్యులర్ బోటనీ ఫ్యాకల్టీ కేటాయించాలని, వారంలో 6 రోజుల పాటు క్లాసులు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కోరారు.

భీమ్ ఆర్మీ TG చీఫ్‌గా సిద్దు రావణ్.. టార్గెట్ ఏంటంటే?
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియమితులయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడతామని అన్నారు. తెలంగాణను బహుజనుల అడ్డాగా మార్చి, నీలి జెండా రాష్ట్రంగా తీర్చిదిద్దతామని ధీమా వ్యక్తం చేశారు.

మందసలో రూ.1.20 కోట్ల బ్రిడ్జిల తనిఖీ
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో చీపి–బుడంబో, దాలసరి–బుడంబో మధ్య రూ.60 లక్షల చొప్పున రెండు బ్రిడ్జిలు నిర్మించారు. ఐటీడీఏ ఈఈ రమాదేవి గురువారం వాటి క్వాలిటీ, మెటీరియల్ ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యత నిర్ధారణ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జిలతో గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని, రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

అత్యాచార కేసులో నిందితులపై కఠిన శిక్షలు
నారాయణపేట జిల్లా మక్తల్ లో మహిళపై అత్యాచారం, కత్తిపోటు ఘటనలో ఇద్దరు అరెస్ట్ కాగా, కేసులో 70(1) BNS సెక్షన్ మాత్రమే నమోదు చేయడంపై దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ఇల్లు, వితంతు పింఛన్ మంజూరు చేయాలని, ఆమె కుమారుడికి ప్రత్యేక విద్య అందించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

జీరుగెడ్డలో 19 మంది రైతులకు జీరాయితీ పట్టాల పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా పంచాయతీ జీరుగెడ్డలో గురువారం రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 19 మంది రైతులకు జీరాయితీ పట్టాలు అందజేశారు. పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా కేంద్రంలో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు వర్తిస్తాయని సర్పంచ్, ఎంపీటీసీ సూచించారు. పెసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, స్థానికులు పాల్గొన్నారు.

పల్నాడులో కరువు పరిస్థితులపై అలర్ట్
పల్నాడు జిల్లాలో వర్షాభావంతో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని Nature Welfare Council AP చైర్మన్ అంబటి నవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు, పశువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ట్యాంకర్ల సరఫరా, చెరువులు-కాలువల రీచార్జ్ చర్యలు చేపట్టాలని, కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కోరారు.

విద్యార్థిని మృతిపై మాజీ ఎమ్మెల్యే యాదవ్ విచారం
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన కళాశాలకు వెళ్లి, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని, వారికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వి. నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఆష్ఠలో కృష్ణాష్టమి సెలబ్రేషన్.. రాధాకృష్ణ వేషాలతో సందడి!
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ఠ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో చిన్నారులు రాధా, కృష్ణుల వేషాల్లో అలరించడంతో పాటు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ HM మాట్లాడుతూ.. కేవలం వేషధారణకే పరిమితం కాకుండా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణుడు-సుదాముల అపురూపమైన స్నేహ బంధం గురించి విద్యార్థులకు వివరించారు.

మంత్రిపాలెం స్కూల్లో విపత్తులపై అవగాహన-లైఫ్ సేవింగ్ టిప్స్!
బాపట్ల జిల్లా నగరం మండలం మంత్రిపాలెం హైస్కూల్లో CRDS స్వచ్ఛంద సంస్థ గురువారం విపత్తులపై అవగాహన సెషన్ నిర్వహించింది. తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు విద్యార్థులకు నీట మునిగినా, కరెంట్ షాక్ వచ్చినా, ఎవరైనా గాయపడినా ఎమర్జెన్సీలో ఎలా రెస్క్యూ చేయాలో ప్రాక్టికల్‌గా నేర్పించారు. CRDS సిబ్బంది సురేఖ, రేవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థిని ఆత్మహత్యకు వేధింపులే కారణమంటూ LHPS ధర్నా
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్యకు ప్రిన్సిపల్, అధ్యాపకుల వేధింపులే కారణమని లంబాడి హక్కుల పోరాట సమితి ఆరోపించింది. గురువారం కళాశాల ముందు ధర్నా నిర్వహించి, విచారణ, చర్యలు డిమాండ్ చేశారు. LHPS అధ్యక్షుడు రాంబల్ నాయక్ బాలిక కుటుంబానికి న్యాయం చేసేదాకా పోరాడతామని హెచ్చరించారు.

ఉల్లిపాలెం స్కూల్లో విపత్తులపై అవగాహన కార్యక్రమం
బాపట్ల జిల్లా నగరం మండలం ఉల్లిపాలెం జడ్పీహెచ్ హైస్కూల్లో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గురువారం విపత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. 8,9 తరగతుల విద్యార్థులకు విపత్తు రకాలు, CPR, ఎమర్జెన్సీ రెస్క్యూ పద్ధతులపై తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు వివరించారు. ప్రాక్టికల్‌గా కూడా నేర్పించారు. CRDS సిబ్బంది సురేఖ, రేవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా భద్రతా విభాగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా మహిళా భద్రతా విభాగాన్ని నూతనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గురువారం ప్రకటించారు. మహిళలు, చిన్నారులపై నేరాల అరికట్టడం, బాధితులకు తక్షణ సహాయం, కేసుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్, పునరావాసం బాధ్యతలని తెలిపారు. ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్, కౌన్సెలింగ్ కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా ఆష్ఠలో 903 డిజిటల్ రేషన్ కార్డులు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ఠ గ్రామంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. 903 కార్డులు అందాయని, మిగిలినవి త్వరలో వస్తాయని రేషన్ డీలర్ లోలం భూమన్న, సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ తెలిపారు. కార్డు రాని వారు ఆందోళన చెందొద్దని, త్వరలో గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలన్నింటికి డిజిటల్ కార్డులు వస్తాయని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పరకాలలో SR ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
హన్మకొండ జిల్లా పరకాలలోని SR ఉన్నత పాఠశాలలో గురువారం కృష్ణజన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు శ్రీకృష్ణుని లీలలు, భగవద్గీత విశిష్టతను వివరించారు. ఛైర్మన్ వరదారెడ్డి, డీజీఎం సచిన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

భద్రాద్రికి రైలు మార్గానికి కదలికొచ్చిందోచ్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కీలకమైన పాండురంగాపురం–మల్కన్ గిరి రైల్వే లైన్ పనులకు మరోసారి కదలిక వచ్చింది. పాండురంగాపురం నుంచి సాకేతపురి వరకు 16 కి.మీ. లైన్ ను ముందుగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, పనుల వేగవంతానికి ఆదేశించారు. భద్రాచలం ఆలయ భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరం.

MRI కోసం వెళ్తే.. 2028 వరకు వెయిటింగా?
MRI కోసం ఆసుపత్రికి వెళ్తే.. వెంటనే స్కాన్ చేస్తారని అనుకుంటాం. కానీ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో కొందరు రోగులకు 2028 తేదీలు ఇస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్క MRI మెషీన్ మాత్రమే ఉండటం, భారీ రోగుల రద్దీ దీనికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. రోజుకు దాదాపు 10 MRI స్కాన్లు మాత్రమే చేయగలుగుతున్నట్లు నివేదిక తెలిపింది. అత్యవసర, ట్రామా కేసులకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగికి సమయానికి పరీక్ష అందకపోతే.. వైద్యం అందుబాటులో ఉందన్న మాటకు అర్థమేంటి?
రాజోలిలో ప్రీ ప్రైమరీ బడిలో కృష్ణాష్టమి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి పునరావాస గృహాల MPPS న్యూ ప్లాట్స్ పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. హెచ్ఎం రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. నవ్యశ్రీ కృష్ణుడిగా, సంయుక్త గోపికగా ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. రేణుక, ఇంద్రవర్ధన, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

పరకాల సీఐగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు
హన్మకొండ జిల్లా పరకాలలో సీఐగా ఏ. ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఏమైనా ఉంటే తనను నేరుగా తమని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
సంగెం విద్యాభారతిలో కృష్ణాష్టమి వేడుకలు
హన్మకొండ జిల్లా సంగెం మండలంలోని విద్యాభారతి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు పండుగ విశిష్టతను వివరించారు. పాఠశాలలో సందడి నెలకొంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రదర్శనలను ఆస్వాదించారు.

నందిపేట్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియామకం
నందిపేట్ మండల కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియమితులయ్యారు. గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు దూడ వెంకటేష్ నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అక్బర్ తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు.ఈ సందర్భంగా దూడ వెంకటేష్ మాట్లాడుతూ.. అక్బర్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.