పీరియడ్స్ పెయిన్‌కు..కొత్త టెక్ సొల్యూషన్

మహిళలకు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించేందుకు ‘Curapod-M’ అనే డ్రగ్-ఫ్రీ పరికరాన్ని ప్రముఖ హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘లైట్‌మెడ్ ఇండియా’ రూపొందించింది. మందులు తీసుకోకుండా వాడగలిగే ఈ పరికరాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఫొటోబయోమాడ్యులేషన్ (Photobiomodulation - PBM) అనే సైన్స్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక Red light, Near-infrared light కిరణాలు నొప్పి ఉన్న చోట కణాల లోపలికి వెళ్లి పనిచేస్తాయి.



