తెరపై అద్భుతం వెనుక.. కాగితంపై గీసిన కథ!

ఒక సినిమా సీన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు స్టోరీబోర్డ్.. ఆర్టిస్టుల చేతుల్లో రూపుదిద్దుకుంటుంది. వీరు డైరెక్టర్ ఆలోచనలకు స్కెచ్‌ల రూపంలో ప్రాణం పోస్తారు. కేవలం బొమ్మలు గీయడం కాదు, సినిమా విజన్‌ను తెరపైకి తేవడంలో వీరిది విశేష కృషి. ‘పుష్ప 2’, ‘కుబేర’, ‘కీడా కోలా’, ‘తండేల్’ వంటి సినిమాలకు స్టోరీబోర్డ్స్ రూపొందించిన లక్ష్మీ భరణి పోరినీ.. షూటింగ్‌కు ముందే సీన్లను ఊహించుకోవడం, 24 క్రాఫ్ట్స్‌తో సమన్వయం చేసుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు



