స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి PM SHRI ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఖలీదా శిరీన్ తెలిపారు. B.Edతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నవంబర్ 2026నుంచి ఏప్రిల్ 2027వరకు తాత్కాలిక ప్రాతిపదికన నెలకు 16,500 వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5నుంచి 9వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.


