ఖమ్మంలో రేపటి నుంచి పెసల కొనుగోళ్లు..!

ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఖమ్మం, వైరా మార్కెట్లలో పెసల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. కొనుగోళ్ల బాధ్యతను DCMSకు అప్పగించినట్లు ఆ సంస్థ బిజినెస్ మేనేజర్ సందీప్ తెలిపారు. వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు చేసుకున్న రైతులనుంచి బయోమెట్రిక్ (వేలిముద్రలు) ఆధారంగా ఈ కొనుగోళ్లు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.


