← Back to news

ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

By A VIJAY KUMAR· 1h ago· Narsampet (Ct), Narsampet, Warangal
ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్టోబర్ 6న నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్‌పీ జాతీయ ప్రతినిధి కళ్లెపెళ్లి ప్రణయ్‌దీప్ పిలుపునిచ్చారు. నర్సంపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులతో కలిసి సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్‌ఎఫ్ బలమైన విద్యార్థి ఉద్యమంగా ఎదిగిందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ, రిషిత్ రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

More in Local