కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నందిపేట్ రైతు వేదికలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలాల నుంచి మొత్తం 104 మందికి ఈ చెక్కులు వచ్చాయి. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ఆఫీసర్లు, లీడర్లు కలిసి పనిచేయాలని సూచించారు.



