కేకే సర్వే కిరణ్ పొలిటికల్ ఎంట్రీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఏకం' ప్లాట్‌ఫామ్ ద్వారా అభ్యర్థులను నిలుపుతున్నట్లు కేకే సర్వే CEO కిరణ్ కొండేటి ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని చెప్పిన తమ అంచనా నిజమైందని గుర్తుచేశారు. ఉచిత పథకాల కంటే తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులు, ఉచిత విద్య, వైద్యమే ముఖ్యమని, రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధంగా ఉన్న 1.60 లక్షల మందిని ‘ఏకం’ ద్వారా బరిలోకి దింపుతామని చెప్పారు.


