← Back to news

నాకు నిజంగా నాలుగు ఓటర్ కార్డులున్నాయా?: ప్రకాశ్ రాజ్

By Vishi· 1h ago

TG: తనకు నాలుగు ఓటర్ కార్డులున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోందని, అయితే అది నిజమో కాదో తేల్చడానికి మాత్రం వాళ్లు రావడం లేదని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ అన్నారు. గతంలో తను తమిళనాడు రాజధాని చెన్నైలో ఉండేవాడినని, బెంగళూరుకు వెళ్లిన తర్వాత తన ఓటర్ కార్డు మార్పించుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తను ఎన్నికల కమిషన్ ముందు సమాధానం కూడా ఇచ్చానన్నారు. అయినా బీజేపీ వాళ్లు తన మీద బురద జల్లుతూనే ఉన్నారని తెలిపారు.

More in TG