డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతిపై MLA దిగ్భ్రాంతి

కావలి మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రజా వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి అన్నారు. వైద్య రంగంలో ఆయన అందించిన సేవలు, ప్రజల పట్ల చూపిన ఆత్మీయత, మానవత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.


