కానవరంలో జనసేన ఆత్మీయ సమావేశం

రాజానగరం మండలం కానవరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీరమహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని బత్తుల వెంకటలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.



