మంగళగిరిలో వ్యాపారులకు ఇబ్బందులు
మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్‌లో రోడ్డు మార్జిన్లను ఆక్రమించి వాహనాలను అడ్డంగా నిలుపుతుండటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల ముందే వాహనాలు పార్క్ చేయడంతో వ్యాపారం దెబ్బతింటోందని, రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని షాప్ నిర్వాహకురాలు నందిని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్, పోలీస్ అధికారులు స్పందించి అక్రమ పార్కింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.



