← Back to news

తాండూరు MLA సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

By Kamal Kumar· 1h ago· Yenkapalle, Yelal, Vikarabad
తాండూరు MLA సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పలువురు BRS నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో తాండూరు MLA బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వార్డు మెంబర్ యాదగిరితో పాటు రాజేందర్, రాములు, బాల్‌రాజ్, మహేందర్ తదితరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి సూచించారు.

More in Local