← Back to news

చీకటి కోనేరు మేకోవర్ పూర్తి!

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Amaravati, Kanchili, Srikakulam
చీకటి కోనేరు మేకోవర్ పూర్తి!

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చీకటి కోనేరు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు, పురప్రజల సౌకర్యార్థం ఈ పనులు చేపట్టారు. దేవస్థానం ఈఓ కోగంటి సునీల్ కుమార్ ఈ వివరాలు తెలిపారు. కోనేరు పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. శనివారం నుంచి ప్రాంగణం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈఓ కోరారు.

More in Local