విటమిన్ డీ లోపం.. గుండె కణాల్లో ఒత్తిడి

విటమిన్ డీ లోపం గుండె కణాలపై ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌లోని ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) రిసెర్చ్ లో తేలింది. విటమిన్ డీ తక్కువగా ఉంటే గుండె కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రిసేరచర్స్ గుర్తించారు. అయితే ఈ అధ్యయనం ఎలుకలు, ల్యాబ్‌లో పెంచిన గుండె కణాలపై మాత్రమే జరిగింది. మనుషులపై దీని ప్రభావాన్ని నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని NIN తెలిపింది.



