వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం ‘6-4-2’ ఫార్ములా!

పని ఒత్తిడి, అలసట తగ్గించుకుని వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ‘6-4-2’ ఫార్ములా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో రోజుకు 6 గంటలు ముఖ్యమైన పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. మరో 4 గంటలను వ్యాయామం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, హాబీలకు కేటాయించాలి. ఇంకో 2 గంటలు కుటుంబం, స్నేహితులతో గడపాలి. ఇలా పని, వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలెన్స్ పాటిస్తే ఒత్తిడి తగ్గి రోజును హాయిగా గడపొచ్చని ఈ ఫార్ములా చెబుతోంది.



