హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌పై అభ్యంతరకరంగా రాసిన పుస్తకం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు. హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు.



