← Back to news

నాటోకు రష్యా అణు హెచ్చరిక

By A.Ajay· 7h ago
నాటోకు రష్యా అణు హెచ్చరిక

బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటోకు రష్యా హెచ్చరిక చేసింది. పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్‌గ్రాడ్‌ను రష్యా నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తే అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు నాటోకు రష్యా ఓ సందేశం పంపినట్లు సమాచారం. అయితే కలినిన్‌గ్రాడ్‌పై తమకు ఎలాంటి ముప్పు లేదని నాటో తెలిపింది. రష్యా అణు హెచ్చరికలు బాధ్యతారహితమని చెప్పింది.

More in International