44 ఏళ్ల తర్వాత.. మహిళల హాకీలో భారత్‌కు గోల్డ్!

ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ టీమ్ అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చైనాను 1-0తో ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. లాల్‌రెమ్సియామి 10వ నిమిషంలో కొట్టిన అద్భుతమైన గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది. చైనా దాడులను గోల్‌కీపర్ సవితా పునియా కెప్టెన్సీలో డిఫెన్స్ ఎఫెక్టివ్‌గా అడ్డుకుంది. దీంతో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీకి ఏషియన్ గేమ్స్ గోల్డ్ దక్కింది. ఈ గెలుపుతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు బెర్త్ కూడా ఖరారైంది.

