Latest

ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానం
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. వక్ఫ్ కాంప్లెక్స్ ముందు ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహ్మాన్, కౌన్సిలర్ మహమ్మద్ నిజాం, సీనియర్ జర్నలిస్ట్ అహ్మదుల్లా ఖాన్ ప్రారంభించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

KGBV విద్యార్థుల రాఖీ వేడుకలు
రాఖీ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రమేష్ కుమార్ సందర్శించారు. కేజీబీవీ విద్యార్థినిలు ఆయనకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినుల ఆప్యాయతకు ఆయన అభినందనలు చెప్పారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మంత్రులు
రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడుతూ “నేను అందరికీ సోదరినే. పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. మా ఆడపడుచులందరిపైనా ఆయన ఆశీర్వాదం ఉండాలి” అని అన్నారు.

చైతు, గోపీచంద్ మిస్ చేసుకున్న హిట్ మూవీ?
హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ స్టోరీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ స్టోరీని డైరెక్టర్ మొదట నాగచైతన్యకు, ఆ తర్వాత గోపీచంద్‌కి నరేట్ చేశారట. అప్పట్లో వేరే ప్రాజెక్ట్ బిజీ వల్ల వాళ్ళు ఓకే చేయలేకపోవడంతో ఈ ఆఫర్ రవితేజ దగ్గరకు వెళ్లినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ రవితేజకి మంచి కంబ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది.

భీమవరంలో కొత్త పంచాయతీ భవనం ప్రారంభం
వెంసూరు మండలంలోని భీమవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు. గ్రామానికి కొత్త భవనం అందుబాటులోకి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పంచాయతీ భవనం ద్వారా గ్రామస్థులకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

డ్రగ్స్ నిర్మూలన పౌరులందరి సామాజిక బాధ్యత
AP: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యతతోపాటు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరిలో ఏపీ ఈగల్–ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మధ్య డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అవగాహన, నిఘా, పునరావాసం, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు తెలియ జేయాలని సూచించారు.

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) చేసింది. పలమనేరు ఆర్టీసీ డిపో నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 2010కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌టీఈ చట్టంలోని 23(1) సెక్షన్‌ను సవరించాలని కోరారు. అర్హత మార్కులను తగ్గించడంతో పాటు బోధనా సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలన్నారు.

అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలి
జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించాలని పలమనేరు నియోజకవర్గ పి-4 ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీదేవి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన జీరో పావర్టీ మిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామంలో గ్రామ సమాఖ్యల ద్వారా గుర్తించిన అత్యంత నిరుపేద కుటుంబాలను పరిశీలించారు.

29, 30వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి లోకేష్ వర్మ తెలిపారు. ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

తీరనున్న ఆదివాసీల దశాబ్దాల కల
అనంతగిరిలో ఆదివాసీల దశాబ్దాల కల నెరవేరబోతుంది. నాలుగు గ్రామాల గిరిజన గ్రామాల గ్రామాల రవాణా కష్టాలకు తెరపడనుంది. కివర్ల పంచాయతీ పరిధి బుడ్డి గురువు నుండి చిడిగురువు వరకు 2 కిలోమీటర్లు రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనులపై బుడ్డిగురువు, బంద గురువు, చిదిగరువు, రాళ్లగరువు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పాఠశాల కోసం రోడ్డెక్కిన మారికవలస గిరిజనులు
AP: మారికవలస బాయ్స్ గిరిజన గురుకుల పాఠశాలను పూర్తిగా ఎత్తివేసి, ఆ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబుతో కలిసి వారంతా నిరసన తెలియజేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే వందలాది మంది గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న మారికవలస గురుకులాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని నినాదాలు చేశారు.

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలి
AP: తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయానికి గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.

పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ
AP: తాడికొండలో ప్రారంభమైన డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ పేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేయనుంది. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు, ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడంతో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుందన్నారు.

RSS కార్యక్రమంలో పాల్గొన్నందుకు గవర్నమెంట్ టీచర్ల సస్పెన్షన్
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు RSS రూట్ మార్చ్‌లో పాల్గొన్నందుకు సస్పెండ్ చేశారు. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 2021కు వ్యతిరేకమని విద్యాశాఖ పేర్కొంది. యాద్గిర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చన్నబసప్ప ముధోల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. హునసగి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్ గురురాజ్ జోషి, సూర్‌పూర్ తాలూకా కుప్పిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్ హెడ్ టీచర్ అన్నా సాహెబ్ దేశ్‌ముఖ్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

గ్రీన్ కవర్ పెంచి పర్యావరణ పరిరక్షణ చేద్దాం
AP: రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల ఆరోగ్యకర జీవనానికి గ్రీన్ కవర్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె.నాగబాబు అన్నారు. ప్రస్తుతం 29 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. మొక్కల సంరక్షణను జియోట్యాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్ద చెట్టు తొలగిస్తే పది మొక్కలు నాటే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపును ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

బిల్లులు ఇవ్వకపోతే స్కూళ్లకు తాళాలు
TG : తెలంగాణలో ‘మన ఊరు - మన బడి’ పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. పనులు పూర్తి చేసి మూడేళ్లవుతున్నా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యామని అంటున్నారు. ఈ విషయమై ఖమ్మం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. సెప్టెంబర్ 17 లోగా పైసలు రిలీజ్ చేయకపోతే, తాము పనులు చేసిన ప్రభుత్వ స్కూళ్లకు తాళాలు వేస్తామని తెలిపారు.

‘ఇదే నేను పనిచేసే ఆఫీస్’ అని చూపించిన క్షణం
చిన్నప్పుడు మనల్ని స్కూల్‌కి తీసుకెళ్లిన తల్లిదండ్రులనే పెద్దయ్యాక మనం పనిచేసే చోటికి తీసుకెళ్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? బెంగళూరులో గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తన తల్లిదండ్రులను తొలిసారి ఆఫీస్‌కి తీసుకెళ్లి, అక్కడి వాతావరణాన్ని చూపించింది. ఆ క్షణాలను వీడియోగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన ఆనందం, గర్వమే ఈ వీడియోను ఇంతగా కనెక్ట్ చేసిందంటున్నారు. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసిన ఈ చిన్న క్షణం నెటిజన్లను బాగా టచ్ చేసింది.
అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెడబయలు భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి జరుగుతున్నట్లు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య గుర్తించింది. ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎంఆర్‌ఓకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని, డీఎస్‌ఓ, జాయింట్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపింది. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

నల్లబెల్లి ఎంపీడీఓగా రమణారెడ్డి
నల్లబెల్లి ఎంపీడీఓ పింగిలి రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై నల్లబెల్లి ఎంపీడీఓగా నియమితులయ్యారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు శాఖాపరమైన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వరుస చోరీలు..పోలీసుల నిఘా ఏదీ?
AP: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో వరుసచోరీలు కలకలం రేపుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలోని స్టీల్ షాప్, బేకరీలో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేల విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చోరీలు జరిగినా పోలీసులు నిఘా పెంచకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిఘా లోపం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Singlesపై RGV క్రేజీ పోస్ట్!
డైరెక్టర్ RGV మళ్లీ ఓ ఇంట్రెస్టింగ్<a href="https://x.com/RGVzoomin/status/2093167410920689707/photo/1"> పోస్ట్</a> పెట్టారు. "ప్రతి సక్సెస్‌ఫుల్ అబ్బాయి వెనుక ఒక అమ్మాయి ఉంటుంది" అనే మాటను ఆయన అస్సలు ఒప్పుకోనని చెప్పారు. సింగిల్‌గా ఉంటూనే లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ సాధించిన వాళ్లు చాలామంది ఉన్నారని ట్వీట్ చేశారు. టాటా, బాటా, APJ అబ్దుల్ కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్, యోగి, బాబా రాందేవ్ లను ఎగ్జాంపుల్స్‌గా చూపించారు. సక్సెస్‌కి పెళ్లితో సంబంధం లేదని, సింగిల్స్ కూడా గ్రేట్ అని ప్రూవ్ చేశారని తన పోస్ట్ ద్వారా తెలిపారు.