Crime

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ
Crime· 9 Jun 2026

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలే ఆభరణాలతో పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబాయి వెళ్లి తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో తమకు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడం, మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ
Crime· 8 Jun 2026

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ

TG: మల్కాజిగిరి PS పరిధి మౌలాలి RTC కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వేఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్‌పై కన్నేసిన భార్య గంగాభాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా మర్డర్‌కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్‌కు విషాన్ని అన్నంలో కలిపి పెట్టడంతో మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా చేసి బకెట్‌లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో కోర్టు కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36)లకు ఉరిశిక్ష, గంగాభాయి(65)కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

అమెరికాలో దారుణం.. ఫేక్ పిజ్జా ఆర్డర్ తో తెలంగాణ యువకుడి దారుణ హత్య
Crime· 7 Jun 2026

అమెరికాలో దారుణం.. ఫేక్ పిజ్జా ఆర్డర్ తో తెలంగాణ యువకుడి దారుణ హత్య

తెలంగాణకు చెందిన 28 ఏళ్ల అన్షుల్ కుంచా అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, అడిషనల్ ఇన్ కమ్ కోసం వీకెండ్స్‌లో పిజ్జా డెలివరీ చేసేవాడు. ఫిలడెల్ఫియాలో అర్ధరాత్రి వచ్చిన పిజ్జా ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళితే కొందరు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ అడ్రస్ ఖాళీ ఇంటిదని పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో ఇద్దరు అనుమానితులు అతడిని వెంబడించినట్లు కనిపించింది. డబ్బు, వస్తువులు ఏవీ దోచుకోకపోవడంతో ముందే పన్నిన ఉచ్చేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.