Crime

 లంచం ఇవ్వలేదని  అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం
Crime· 4 Jun 2026

లంచం ఇవ్వలేదని అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం

యూపీ ముజఫర్ పూర్ కు చెందిన రేష్మ అనే మహిళ తన 14 ఏళ్ల కుమార్తెకు కాలు విరగడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టరు ఆపరేషన్ చేయడానికి లంచం అడగడంతో ఇచ్చుకోలేక మేజిస్ట్రేట్ కి కంప్లయింట్ చేసింది. ఆమెకు ఉచితంగా సర్జరీ చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే ఆ వైద్యుడు లంచం ఇవ్వనిదే చేయనని మొండికేశాడు.25 వేలు ఇచ్చుకోలేనన్న ఆ మహిళ రూ. 8 వేలు చెల్లించింది. ఆపరేషన్ పూర్తయి కోలుకున్నాక చెకప్ కోసం వెడితే మిగిలిన అమౌంట్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వలేకపోవడంతో కాలును టెస్ట్ చేసే పేరుతో ఇటూ అటూ మెలిపెట్టి నలిపేశాడు. ఇంటికి వెళ్లాక చూడగా కాలు విరిగిపోయింది.

ఖాన్ సర్ కోచింగ్ పై దాడి... ప్రత్యర్థుల ప్లానేనా ?
Crime· 3 Jun 2026

ఖాన్ సర్ కోచింగ్ పై దాడి... ప్రత్యర్థుల ప్లానేనా ?

పాట్నాలో ఫేమస్ యూట్యూబర్, ఎడ్యుకేటర్ 'ఖాన్ సార్' కోచింగ్ సెంటర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కోచింగ్ సెంటర్ బోర్డులు, ఆస్తులు ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది. మొదట కాల్పులు జరిగాయని వార్తలు వచ్చినా అలాంటిదేం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల బీహార్ పోలీస్ నియామకాల్లో ఖాన్ సార్ కోచింగ్ నుంచి వేల మంది ఎంపిక కావడం, తక్కువ ఫీజులతో విద్య అందించడం కొందరికి నచ్చక ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లే ఈ దాడి వెనుక ఉండొచ్చని ఖాన్ సర్ ఆరోపించారు. దాడి విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున స్టూడెంట్ల్ వచ్చి ఖాన్ సర్ కి మద్దతుగా నినాదాలు చేశారు.

 ట్విషా శర్మ కేసులో  గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ
Crime· 2 Jun 2026

ట్విషా శర్మ కేసులో గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ

భోపాల్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మరణం కేసులో వీరిద్దరి పోలీస్ రిమాండ్ ముగియడంతో భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ట్విషా శర్మ కుటుంబ సభ్యులు వీరిపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కోర్టులో స్వయంగా తీవ్ర ఆవేశంతో వాదనలు వినిపించడంతో, కోర్టు హాల్ నాటకీయ పరిణామాలకు, వాదోపవాదాలకు వేదికైంది.

అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్
Crime· 1 Jun 2026

అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్

AP: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును మర్డర్ చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం జీ.హోసళ్లి విలేజ్‌లో చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దర్గప్పతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమె కుమారుడు నిలదీశాడు. దీంతో లవర్‌తో కలిసి గంగమ్మ కన్నకొడుకు వీరేంద్ర(15)ను కత్తితో పొడిచి చంపి డెడ్‌బాడీని స్మశానవాటికలో పాతిపెట్టింది. తన కుమారుడు కన్పించడంలేదని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకంగా దర్యాప్తు లేటు అవుతుందని హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన నిందితురాలు కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!
Crime· 29 May 2026

శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!

కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే స్టూడెంట్ తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలిసి స్టూడెంట్ పేరెంట్స్, relatives కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశారు. తమ బాబు చనిపోవడానికి రీజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ టైమ్‌లో పోలీసులు, పేరెంట్స్ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ పేరెంట్స్ రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు కొందరిని ఈడ్చుకెళ్లడంతో అక్కడ వాతావరణం ఫుల్ టెన్షన్‌గా మారింది.

ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్
Crime· 28 May 2026

ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్

మాజీ మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ట్విషా శర్మ అత్తగారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ న CBI ఈరోజు భోపాల్‌లో అరెస్ట్ చేసింది. ఆమె ఇంట్లో దాదాపు 7 గంటల పాటు సోదాలు, విచారణ జరిపిన అనంతరం సీబీఐ ఈ చర్య తీసుకుంది. గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు నిన్న రాత్రి (మే 27) రద్దు చేసింది. ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని, నోటీసులకు స్పందించడం లేదని కోర్టు తీవ్రంగా పరిగణించింది.మే 12న భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించగా, వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది.