Latest

ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు
AP· 30 Jul 2026

ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు

AP: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం భారీ ఆందోళన చేపట్టారు. మార్కాపురం–ఎర్రగొండపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు రూ.1000 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద
TG· 30 Jul 2026

కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని జిల్లా SP జానకి షర్మిల క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు సమీపానికి వెళ్లొద్దని, వరద నీటిలో సెల్ఫీలు, ఫోటోలు తీయొద్దని హెచ్చరించారు.

స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు
Crime· 30 Jul 2026

స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు

కేరళలో కోజికోడ్‌లోని పెరంబ్రా బ్లాక్ రిసోర్స్ సెంటర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరిపింది. ఇందులో గవర్నమెంట్ టీచర్లు డ్రగ్స్ ఏజెంట్లుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఇద్దరు టీచర్లు పోలీసులు అరెస్టు చేయగా, ఈరోజు ఇంకో టీచర్ను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్‌కు EMI పద్ధతిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఒకవైపు విద్యార్థుల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ, మరోవైపు వారికే డ్రగ్స్ అమ్మడం గమనార్హం.

స్నేహితుడిపై కత్తితో దాడి
Crime· 30 Jul 2026

స్నేహితుడిపై కత్తితో దాడి

TG: తనకంటే బాగా చదువుతున్నాడనే అసూయతో ఓ విద్యార్థి తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోబిన్, నిజాం ఇద్దరూ ఒకే ట్యూషన్ సెంటర్‌లో చదువుకుంటున్నారు. చదువులో మోబిన్ ముందుండటాన్ని జీర్ణించుకోలేక నిజాం కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మోబిన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏపీలో కరోనా భయంతో తెలంగాణలో పరీక్షలు
Health· 30 Jul 2026

ఏపీలో కరోనా భయంతో తెలంగాణలో పరీక్షలు

TG: ఆంధ్రలో కొత్తగా 49 కోవిడ్ కేసులు రావడంతో తెలంగాణలో జనాలు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని హాస్పిటల్ ల్లో కరోనా పరీక్షల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ట్రావెల్ చేసి వచ్చినవాళ్లు, చిన్నపాటి అనారోగ్య లక్షణాలు ఉన్నవాళ్లు ఈ పరీక్షలకు వస్తున్నారు. అయితే, ఇప్పటివరకు చేసిన టెస్ట్ ల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని డాక్టర్లు చెప్పారు. జలుబు, జ్వరం, శ్వాస సమస్యలు ఉంటేనే పరీక్షలు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఇవాళ ‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ
TG· 30 Jul 2026

ఇవాళ ‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ

TG: ప్రముఖ రచయిత దివంగత రాచకొండ విశ్వనాథ శాస్త్రి(రావిశాస్త్రి) రచనల్లోని కీలక వాక్యాలను , గుర్తుంచుకోదగిన పేరాలను, వ్యంగాత్మక సంభాషణలను, విషాద దృశ్యాలను సేకరించి ‘రంగులూ, ఫిరంగులూ’ పేరుతో 350 పేజీల పుస్తకంగా తీసుకొస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రచయితలు ఎం.ఎస్.నాయుడు, మృణాళిని, జి.ఎస్.చలం తదితరులు పాల్గొంటారు.

లక్షకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్!
Education· 30 Jul 2026

లక్షకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్!

భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు లక్షకు పైగా (1,00,843) ఒక్క టీచర్ తోనే నడుస్తున్నాయని UDISE+ 2025–26 డేటా ఆధారం తో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 16,357 సింగిల్-టీచర్ పాఠశాలలు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలో 16శాతం పైగా ఉంది. తెలంగాణలో ఇలాంటి స్కూళ్లు 4,793 ఉన్నాయి. ఏపీ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లోనే దేశంలోని 65శాతం సింగిల్-టీచర్ స్కూళ్లు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ లోపాల వల్లే ఈ ప్రాబ్లమ్ వచ్చిందని గవర్నమెంట్ రాజ్యసభలో చెప్పింది.

ఉప్పొంగిన పొచ్చెర జలపాతం..  హైఅలర్ట్
TG· 30 Jul 2026

ఉప్పొంగిన పొచ్చెర జలపాతం.. హైఅలర్ట్

TG: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పర్యాటక కేంద్రం పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరి జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ఉధృతి నిన్నటితో పోలిస్తే మరింత పెరగడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసి, ఎవరినీ అనుమతించడం లేదు. వరద ప్రవాహం తగ్గే వరకు పొచ్చెర జలపాతం వద్దకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

REAL/FAKE..కేసులు వాపస్ తీసుకోవాలంటే NEET అడ్మిట్ కార్డు?
News· 30 Jul 2026

REAL/FAKE..కేసులు వాపస్ తీసుకోవాలంటే NEET అడ్మిట్ కార్డు?

NEET పేపర్ లీక్ వివాదం తర్వాత CJP ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఆ టైంలో పోలీసులు నిరసనకారుల మీద FIRలు/కేసులు నమోదు చేశారు. వీటిని వాపస్ తీసుకోవడానికి NEET అడ్మిట్ కార్డు చూపాలనే నిబంధన విధించారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది నిజమని చాలామంది నమ్ముతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ విషయం కూడా ఏ అధికారిక వార్తల్లో లేదు. ఇది పూర్తిగా FAKE NEWS.

సౌరవ్ దాస్ వెంట కంగనా..అదేనా కారణం?
Viral· 30 Jul 2026

సౌరవ్ దాస్ వెంట కంగనా..అదేనా కారణం?

CJP(Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్‌ను నటి, ఎంపీ కంగనా రనౌత్ ‘useless’, ‘unemployed’ అని పిలిచిన విషయం తెలిసిందే. అనంతరం జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో చేసిన ఇంటర్వ్యూలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ ‘కంగనా నన్ను ఎందుకు అటాక్ చేస్తుందో అర్థం కాలేదు. అయితే నేను యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని, అందుకే తను నా వెంట పడుతోందని అన్నారు. అది నిజమా? తను నా మీద ఎందుకు దాడి చేస్తోంది?’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

వాగు దాటబోయి ప్రాణాలు కోల్పోయిన మహిళ
Crime· 30 Jul 2026

వాగు దాటబోయి ప్రాణాలు కోల్పోయిన మహిళ

TG: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బల్లివాగులో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చామన్‌పల్లి గ్రామానికి చెందిన మర్సుకోల పారుబాయి మృతి చెందింది. పెన్షన్ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.

ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే
News· 30 Jul 2026

ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ ముఖ్యమైన విషయాలు చెప్పింది. పులులను కాపాడటం అంటే కేవలం ఒక జంతువును రక్షించడం కాదని, మన అడవులు, నదులు, మొత్తం పర్యావరణాన్నికాపాడుకోవడమే అని తెలిపింది. ప్రధాని మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అని అయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు!
News· 30 Jul 2026

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు!

TG : నిర్మల్, కుమ్రం భీమ్ జిల్లాల్లో రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ, రోడ్లపైకి భారీగా వరద చేరుతోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆర్డర్స్ జారీ చేశారు. కుమ్రం భీమ్ జిల్లాలో DEO హాలిడే డిక్లేర్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు రావాలని అధికారులు చెప్పారు.

నడిరోడ్డులో మహిళపై పోలీసులు దాడి
Crime· 30 Jul 2026

నడిరోడ్డులో మహిళపై పోలీసులు దాడి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహారన్‌పూర్‌లో ఓ యువకుడి హత్య కేసులో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి డెడ్‌బాడీని రోడ్డుపై ఉంచి గొడవకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ ఎక్కువవడంతో పోలీసులు అక్కడికి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీఛార్జ్ చేశారు. ఈ నిరసనలో ఉన్న ఓ మహిళలపై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేశారు.

ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య
Crime· 30 Jul 2026

ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య

AP: చోడవరంలోని ద్వారకానగర్లో లక్కరాజు ప్రశాంత్(23) బీటెక్ పూర్తి చేసి GATE పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో గొడవ జరగడంతో బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతనికి తల్లి, తాపీ పని చేసే తండ్రి నాయుడు, ఒక సోదరుడు ఉన్నారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. SI జోగారావు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

గంజాయి తాగిన యువకులకు పోలీసులు షాక్
Crime· 30 Jul 2026

గంజాయి తాగిన యువకులకు పోలీసులు షాక్

TG: LBనగర్‌లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం PS పరిధిలోని సాహెబ్‌నగర్ బాల్‌రెడ్డి గ్రౌండ్ సమీపంలో దాడిచేసి పట్టుకున్నారు. చింతల్‌కుంట సరస్వతీనగర్‌కు చెందిన గుర్రపు హర్ష్ రోహిత్, వనస్థలిపురం పోలీస్ కాలనీకి చెందిన కోట కృపాకర్ గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్నేహితుల ప్రభావంతోనే గంజాయికి అలవాటు పడ్డామని విచారణలో వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

CM ఉన్న విమానం గాల్లోనే చక్కర్లు.. ఉత్కంఠ
TG· 30 Jul 2026

CM ఉన్న విమానం గాల్లోనే చక్కర్లు.. ఉత్కంఠ

TG: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న CM రేవంత్ రెడ్డికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తుది క్లియరెన్స్ అందకపోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి చివరికి సేఫ్‌గా దించారు. రన్‌వేపై ల్యాండింగ్ ప్రయత్నాన్ని నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

4 మెగా ఇండస్ట్రియల్ పార్కులు
TG· 30 Jul 2026

4 మెగా ఇండస్ట్రియల్ పార్కులు

TG: హైదరాబాద్ శివారులో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద చర్యలు వేగవంతమయ్యాయి. తొలి దశలో తిమ్మాపూర్, ఎలిమినేడు, మాదారం, దండుమైలారం ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. త్వరలో కేంద్రానికి DPR సమర్పించనున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 16 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చెరువులో మునిగిన ఇద్దరు చిన్నారులు
Crime· 30 Jul 2026

చెరువులో మునిగిన ఇద్దరు చిన్నారులు

AP: పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తోటి విద్యార్థులతో కలిసి చెరువు వద్దకు వెళ్లిన బమ్మిడి శివ, కొడవటికంటి కిరణ్ ఈత కొడుతుండగా లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం
Crime· 30 Jul 2026

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

హైదరాబాద్ చైతన్యపురిలోని న్యూమారుతీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భట్టు స్వరాజ్‌కుమార్ షేర్ మార్కెట్‌లో భారీ లాభాల పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.74 లక్షలు కోల్పోయారు. ఆల్ఫా ఇన్వెస్టర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించిన నిందితులు నకిలీ లాభాల వివరాలు చూపించి బాధితుడిని నమ్మించారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టించిన తర్వాత డబ్బు విత్‌డ్రా చేసేందుకు మరిన్ని చెల్లింపులు కోరడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది: సింగిరెడ్డి
Politics· 30 Jul 2026

రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది: సింగిరెడ్డి

TG: రాష్ట్రంలో కరువు ఎల్‌నినో వల్ల కాదు, కాంగ్రెస్ పాలన వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, రైతుల ప్రయోజనాలను విస్మరించిందని అన్నారు. వరద నీటిని సక్రమంగా వినియోగించకుండా ఇతర రాష్ట్రాలకు వదిలేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.