OYO హోటళ్లలో వరుస హత్యలు.. తీవ్ర కలకలం!

హైదరాబాద్‌లోని కొన్ని OYO హోటళ్లలో యువతుల అనుమానాస్పద మృతుల ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 21న మాదాపూర్‌లో నిఖిత, 29న ఎస్‌ఆర్ నగర్‌లో శిరీష, అక్టోబర్ 2న మియాపూర్‌లో సృజన మృతి చెందారు. వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లలో అతిథుల ఐడీ వెరిఫికేషన్, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

