రైతుల రాస్తారోకో.. విద్యుత్ సరఫరాపై ఆగ్రహం!
TG: మెదక్ జిల్లా రామాయంపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో, ధర్నా చేశారు. వ్యవసాయానికి ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిర్ణీత సమయంలో కరెంట్ ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. అక్కడికి చేరుకున్న విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


