Latest

సృష్టి రహస్యం ఇదే! ఒక స్పెర్మ్ నుంచి శిశువు వరకు!▶
Technology· 13 Apr 2026

సృష్టి రహస్యం ఇదే! ఒక స్పెర్మ్ నుంచి శిశువు వరకు!

ఒక చిన్న స్పెర్మ్ అండంలోకి ప్రవేశించిన క్షణం నుంచి, అది క్రమంగా పిండంగా మారి, తొమ్మిది నెలల కాలంలో ఒక పూర్తి శిశువుగా ఎలా ఎదుగుతుందో ఈ వీడియోలో ఎంతో స్పష్టంగా చూపించారు. సృష్టిలోని ఈ గొప్ప రహస్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అద్దె ఇళ్ల విషయంలో పెరుగుతున్న కుల పిచ్చి!▶
Crime· 13 Apr 2026

అద్దె ఇళ్ల విషయంలో పెరుగుతున్న కుల పిచ్చి!

ఇల్లు రెంట్ కు తీసుకోవాలనుకునే వారికి చాలా అవమానాలు, అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇల్లు ఖాళీ ఉందా అని అడిగితే, ఓనర్స్ ముందుగా Caste గురించి అడుగుతున్నారని ఓ మహిళ భాదపడుతూ ఇలా క్వశ్చన్ చేసింది. ఓ పక్క క్యాస్ట్ ఫీలింగ్ పోయింది అంటూనే మరి క్యాస్ట్ ఎందుకు అడుగుతున్నరని బాద పడుతూ ఈ వీడియొ షేర్ చేసింది. దీని గురుంచి మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి..

ట్రంప్‌కు చైనా కౌంటర్: "నీ వల్లే ఇదంతా జరిగింది!▶
Politics· 13 Apr 2026

ట్రంప్‌కు చైనా కౌంటర్: "నీ వల్లే ఇదంతా జరిగింది!

హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్ స్టార్ట్ చేసి ఈ రూట్ మూసుకుపోయేలా చేసింది ట్రంపేనని ఆరోపించింది. ఇరాన్ పోర్ట్ కు వెళ్లే షిప్ లను అడ్డుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ చట్టాల ప్రకారం Act of War అని చైనా పేర్కొంది. వరల్డ్ ట్రేడ్ కి కీలకమైన ఈ ప్రాబ్లం ని శాంతియుత చర్చల ద్వారా సాల్వ్ చేసుకోవాలని చైనా సూచించింది.

జెన్ జి తో వకీల్ సాబ్ చిట్ చాట్ !
Politics· 13 Apr 2026

జెన్ జి తో వకీల్ సాబ్ చిట్ చాట్ !

నా పిల్లలకు కూడా నేను సలహా ఇవ్వను.. అలాగే తలపతి విజయ్ కు కూడా నేనెలాంటి సలహా ఇవ్వను.. ఆయన సమర్ధుడు.. మంచి నటుడు.పార్టీ ఎలా నడపాలో ఆయనకు తెలుసు అని కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్. జెన్ జీతో అరేంజ్ చేసిన ఓ భేటీలో తానే కంటెంట్ క్రియేటర్ ని అయితే దేశభక్తి, ప్రకృతి పరిరక్షణపై వీడియోలు చేస్తానన్నారు. పాలిటిక్స్ ని బిజినెస్ లా చూడరాదని ఓ ప్రశ్నకు రిప్లయ్ ఇచ్చారు. సరిగా యూజ్ చేసుకుంటే సోషల్ మీడియా మోస్ట్ పవర్ ఫుల్ మీడియా అని అన్నారు.

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Health· 13 Apr 2026

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

weight తగ్గడం కోసం ఫుడ్ ఆపేస్తే మీ హెల్త్ కి మంచిది కాదు, దీనివల్ల నీరసం వస్తుంది. కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేయకుండా, ఓట్స్ వంటి హెల్తీ ఫుడ్ తినాలి. ఓన్లీ ఎక్సర్సైస్ మాత్రమే సరిపోదు, సరైన నిద్ర, న్యూట్రీషన్ చాలా అవసరం. అన్ని ఫాట్స్ చెడ్డవి కావు, సీడ్స్ లో ఉండే గుడ్ ఫాట్స్ బాడి కి అవసరం. షార్ట్‌కట్స్ నమ్మకుండా, Healthy Lifestyle ఫాలో అవ్వడమే weight తగ్గడానికి కరెక్ట్ ప్రొసీజర్.

మేం పర్షియన్ గల్ఫ్ దిగ్బంధిస్తాంః ఇరాన్
World· 13 Apr 2026

మేం పర్షియన్ గల్ఫ్ దిగ్బంధిస్తాంః ఇరాన్

మాజోలికోస్తే మొత్తం ప్రపంచమే అభద్రతలో పడుతుంది. హర్ముజ్ మీరు దిగ్బంధిస్తే మేం పర్షియన్ గల్ఫ్ మొత్తం దిగ్బంధిస్తాం అంటూ కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.అంతర్జాతీయ జలాల్లో నౌకలను దిగ్బంధించడం సముద్ర దొంగతనం లాంటిదేనని కామెంట్ చేసింది. మా భద్రతకు ముప్పు కలిగిస్తే పర్షియన్ గల్ఫ్ భద్రత మొత్తం ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరించింది.అమెరికా మా రేవులు దిగ్బంధిస్తే మేం గల్ఫ్ రేవులను మూసేస్తాం.. అప్పుడు మొత్తం ప్రపంచమే ఇబ్బందుల్లో పడుతుందని వార్న్ చేసింది.

హర్ముజ్ దగ్గర ఆగిపోయిన 15 ఇండియన్ షిప్స్
Politics· 13 Apr 2026

హర్ముజ్ దగ్గర ఆగిపోయిన 15 ఇండియన్ షిప్స్

హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతవరణం నెలకొంది. హర్ముజ్ మీదుగా రావాల్సిన 15 భారతీయ నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి.వీటిలో ఎక్కువ ఎల్ఎన్ జీ, ఆయిల్ ట్యాంకర్లు, క్రూడాయిల్ వెస్సల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఒక కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వి కాని నౌకలపై నేరుగా నిషేధం లేకపోయినప్పటికీ జలసంధి దగ్గర నౌకల్ ట్రాకింగ్ మాత్రం బాగా స్లో అయిపోయింది. కాస్త రిలీఫ్ పొందే విషయం ఏమంటే మన నౌకలు మొత్తం 25 ఉంటే పది నౌకలు సేఫ్క్క గా అక్కడ నుంచి దాటేశాయి.

తాడిపత్రిలో చెలరేగుతున్న మైనర్లు !!▶
Crime· 13 Apr 2026

తాడిపత్రిలో చెలరేగుతున్న మైనర్లు !!

తాడి పత్రిలో మైనర్ లు చెలరేగుతున్నారు. పబ్లిక్ హడలి పోయేలా బైకుల మీద స్టంట్లు చేస్తున్నారు. అదీ సాయంత్రం వేళ.. రద్దీ పెరిగే టైములో నడి రోడ్డుపై బైకులను గాల్లోకి లేపి స్పీడుగా నడుపుతూ కేరింతలు కొడుతున్నారు. ఒకడిని చూసి మరొకడు ఈ చేష్టలు చేస్తుంటే చూస్తున్న వారికి చిరాకు పుట్టింది. ఎట్టకేలకు పోలీసులు చూసి బైకులు సరెండర్ చేసుకుని ఈ పొగరెక్కిన కుర్రకారుకి ఓ స్ట్రాంగ్ క్లాసు తీసుకున్నారు. ఇలా అయితే ఎలా అని పేరెంట్స్ ని పిలిచి మరీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

 అద్దాల్లేకుండానే మార్కాపురం టు బెంగళూరు బస్సు !!▶
Crime· 13 Apr 2026

అద్దాల్లేకుండానే మార్కాపురం టు బెంగళూరు బస్సు !!

మార్కాపురం టు బెంగళూరు ప్రైవేట్ బస్సు సీన్ మామూలుగా లేదు బ్రో! ముందు అద్దాలు లేకపోయినా డ్రైవర్ మాత్రం "హెల్మెట్ పెట్టుకుని నడిపిస్తా" అనిపొగరుగా సమాధానం ఇచ్చాడు. కట్ చేస్తే... అది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన బస్సు అని తేలింది. ప్యాసింజర్స్ కంప్లైంట్‌తో పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి బస్సుని సీజ్ చేశారు. ఈడ్రైవర్ ఓ పట్టాన దారికి రాలేదండోయ్ ! బస్సు ఇంజన్ స్టార్ట్ చేయగానే ఓ వింతైన సౌండ్ రావడంతో ప్రయాణికులు సీన్ సితార్ చేశారు ఆడ్రైవర్ పై కంప్లయింట్ పెట్టారు. అప్పుడు గానీ ఆ డ్రైవర్ యాటిట్యూడ్ దిగలేదు.

Technology· 13 Apr 2026

టైలర్లు జాగ్రత్త! మీ పనిని గమనిస్తున్న AI..

ప్రెసెంట్ AI (కృత్రిమ మేధ) మనుషుల పనులను ఫాస్ట్ గా నేర్చుకుంటోంది. ముఖ్యంగా బట్టల ఫ్యాక్టరీల్లో టైలర్లు తలకు కెమెరాలు పెట్టుకుని పని చేస్తుంటే, వారు ఎలా బట్టలు కుడుతున్నారో AI గమనిస్తోంది. అంటే, ఫ్యూచర్ లో తమ ప్లేస్ లో వచ్చే AI కి టైలర్లే స్వయంగా ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. వారు నేర్పే పనే ఫ్యూచర్ లో వారిజాబ్స్ పోయేలా ఉన్నయి. మనుషుల జాబ్స్ త్వరలో పోవొచ్చు అని చూపడానికి ఇదే ఒక ప్రూఫ్.

రోడ్డుపై వెళ్తున్న గర్భిణిపై 'మానవ మృగం' దాడి!▶
Crime· 13 Apr 2026

రోడ్డుపై వెళ్తున్న గర్భిణిపై 'మానవ మృగం' దాడి!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లో మాల్వియా నగర్ ప్రాంతంలో పట్టపగలే ఓ గర్భిణి పట్ల ఒక వ్యక్తి అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఆమె రోడ్డుపై ఫోన్ మాట్లాడుతూ వెళ్తుండగా, వెనుక నుండి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ధైర్యంగా కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు, గర్భిణుల పట్ల ఇలాంటి దారుణాలు జరగడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.

మేకప్ కిట్ తెలేదని పెళ్లి క్యాన్సెల్ చేసుకున్న పెళ్లికూతురు!
Entertainment· 13 Apr 2026

మేకప్ కిట్ తెలేదని పెళ్లి క్యాన్సెల్ చేసుకున్న పెళ్లికూతురు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్ళికూమరుడు తనకు మేకప్ కిట్ తెచ్చివ్వలేదన్న కోపంతో ఒక పెళ్ళికూతురు పెళ్లి క్యాన్సెల్ చేసుకుంది. కనీస అవసరాలను తీర్చలేని వారు జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని ప్రశ్నించింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెళ్లి కోసం పెళ్ళికూమరుడు 12 లక్షలు పెట్టి కొన్న కార్ గొడవలో రాళ్ళు విసరడంతో కార్ అద్దాలు పగిలాయి. చివరకు పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చచెప్పాల్సి వచ్చింది. ఎవరెన్ని నచ్చ చెప్పిన పెళ్లికూతురు వినకపోవడం పెళ్ళికూమరుడు చేసేది ఏమీ లేక వెళ్ళిపోయాడు.

మంగ్లీ కేసులో కొత్త ట్విస్ట్: అడ్వకేట్ కు డ్రంకెన్ టెస్ట్!▶
Local· 13 Apr 2026

మంగ్లీ కేసులో కొత్త ట్విస్ట్: అడ్వకేట్ కు డ్రంకెన్ టెస్ట్!

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ కేసులో కంప్లయింట్ చెయ్యడానికి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేసారు. ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని అనుమానించిన పోలీసులు, టెస్ట్ చేస్తే 27 పాయింట్లు వచ్చాయి. అయితే, అసలు కేసును పక్కదారి పట్టించడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అడ్వకేట్ వాదన. ఈ ఘటనతో స్టేషన్ దగ్గర కాసేపు గందరగోళం, వాగ్వాదం జరిగింది.

ఇదెక్కడి VIP కల్చర్ ▶
Local· 13 Apr 2026

ఇదెక్కడి VIP కల్చర్

బాలీవుడ్ భామ కరీనాకపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాంగ్ క్యూని స్కిప్ చేసి డైరెక్ట్ గా సెక్యూరిటీ గేట్ దగ్గరకి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు కరీనాపై ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకి ఇంత ఎంటైటిల్‌మెంట్ ఎవరు ఇచ్చారు? మామూలు మనుషులు కూడా ఫ్లైట్ ఎక్కాలి కదా అన్న పోస్టుకి 14 లక్షల వ్యూస్ వచ్చాయి. వీఐపీ కల్చర్ కి చెక్ పెట్టాలని చాలా మంది అంటూ ఉంటే కొందరు మాత్రం రూ.6 వేలు కడితే పెయిడ్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఫెసిలిటీ ఉంటుందని కరీనాని డిఫెండ్ చేశారు.

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గాయపడ్డ 60 మంది కార్మికులు!
Crime· 13 Apr 2026

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గాయపడ్డ 60 మంది కార్మికులు!

తమిళనాడులోని విరుద్‌నగర్‌ జిల్లాలో ఒక టపాసుల తయారీ కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. అక్కడ ఉన్న టపాసుల సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన టైమ్ లో లోపల 60 మంది కార్మికులు ఉన్నారు. వారిలో చాలా మందికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి, చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంన్సిడెంట్ లో ఎవరైనా చనిపోయారా, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

వయసు 55 డిగ్రీలు 138
Motivational· 13 Apr 2026

వయసు 55 డిగ్రీలు 138

చదువుకి వయసుతో సంబంధం లేదని అంటారు కదా..? ఈ విషయాన్ని 55 ఏళ్ల రాజస్థాన్ ఎక్స్-ఆర్మీ మ్యాన్ దశరథ్ సింగ్ నిరూపించాడు. ఝుంఝును జిల్లా ఖిరోడ్ గ్రామం నుంచి వచ్చిన ఆయనకి మొత్తం 138 డిగ్రీలున్నాయి. లేటెస్ట్‌గా IGNOU నుంచి Vedic Studiesలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు.ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయ్యాక, స్టడీస్ మీద కాన్సన్ ట్రేట్ చేశాడు. 3 PhDs, 46 PGలు, 52 సర్టిఫికెట్ కోర్సులు చేశాడు. 11 వరల్డ్ రికార్డులు ఇతని పేరు మీద ఉన్నాయి.. ఇప్పుడు సైన్యంలో లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. దశరథ్ సింగ్ నుంచి జెన్ జీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

ఫోటోతో ట్రోలర్స్ కు ఎన్టీఆర్ చెక్
Entertainment· 13 Apr 2026

ఫోటోతో ట్రోలర్స్ కు ఎన్టీఆర్ చెక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కండలు తిరిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన తన బాడీని ఇలా బిల్డ్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్ పై గతంలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. మూవీ షెడ్యూల్ వాయిదా పడిందన్న ప్రచారం జరిగింది. ఈ ఒక్క ఫోటోతో ఎన్టీఆర్ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారు. The quieter it gets… the louder it’s about to be అని క్యాప్షన్ ఇచ్చారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత శబ్దం గట్టిగా వస్తుందని అన్నారు. ఈ కండలు కష్టపడి తెచ్చుకున్నవే కానీ కొనుక్కున్నవి కాదని తన పోస్టులో రాసుకొచ్చారు.

నోయిడాలో కార్మికుల నిరసన ఉద్రిక్తం▶
Local· 13 Apr 2026

నోయిడాలో కార్మికుల నిరసన ఉద్రిక్తం

యూపీలోని నోయిడా ఫేజ్-2లో కార్మికులు జీతాలు పెంచాలన్న డిమాండ్ తో భారీ నిరసన చేపట్టారు. హర్యానా తరహాలో 35% జీతాల పెంపు కోరుతూ జరిగిన ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రతి నెలా 10లోపు జీతాలు ఇవ్వాలని, ఓవర్ టైమ్‌కు రెట్టింపు డబ్బులు ఇవ్వాలని అధికారులు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి.

హర్మూజ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్
World· 13 Apr 2026

హర్మూజ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్

అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. నివురు గప్పిన నిప్పులా పరిస్థితులు మారిపోయాయి. హర్మూజ్ జలసంధిని దిగ్భంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ లో నౌకల్ని కదలనివ్వమని చెప్పారు. దీనికి ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ వ్యంగ్యంగా స్పందించారు. ఒక గణిత సూత్రాన్ని f(f(O))>f(O)' ఎక్స్ లో పోస్టు చేశారు. దీని మీనింగ్ ఏంటంటే హార్మూజ్లో అడ్డంకులు సృష్టిస్తే పెట్రోల్ రేట్లు రెట్టింపు పెరిగిపోతాయని అప్పుడు అమెరికన్లకే కష్టాలని అన్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలసికట్టుగా ఇరాన్ పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 ఓ గజరాజు ప్రసవ వేదన !!▶
Entertainment· 13 Apr 2026

ఓ గజరాజు ప్రసవ వేదన !!

ప్రసవం పునర్జన్మ లాంటిది. అది మనిషికైనా, జంతువుకైనా ఒకటే. మీరు చూస్తున్న ఈ వీడియో ఓ నేషనల్ పార్క్ లో ఓ గర్భం దాల్చిన ఏనుగు ప్రసవ వేదన. వాటికి మనలా లేబర్ రూమ్ ఉండదు. ప్రకృతే లేబర్ రూమ్..తల్లి ఏనుగు నొప్పులు పడుతుంటే మిగతా ఏనుగులు రౌండప్ చేసి దానికి రక్షణగా నిలబడతాయి. ప్రసవ వేదనతో అటూ ఇటూ కదులుతున్న ఏనుగుకు ధైర్యాన్నిస్తాయి. బిడ్డ గడ్డపై పడగానే అన్నీ ఆ పసి గున్నను నిమిరేందుకు ప్రయత్నిస్తాయి. అంత వేదనలోనూ తన బిడ్డను తానే తాకాలని, దగ్గరకు తీసుకోవాలని తల్లి ఏనుగు ఆరాటం చూడండి..!!

కవితపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ !!
Politics· 12 Apr 2026

కవితపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ !!

పిల్లలు తండ్రిని సంతోష పెట్టక పోయినా ఫర్వాలేదు.కానీ ఏడిపించకూడదు అంటూ బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన సోదరి కవితనుద్దేశించి ఈ కామెంట్లు చేశారు. ఈ రాజకీయం ఉంటుంది , పోతుంది. కానీ ఇతరులను బాధపెట్టే తీరు మంచిది కాదంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టొచ్చని. కానీ దానికి ప్రజాదరణ ముఖ్యమని అన్నారు.పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత కవితకు, తండ్రి కేసీఆర్ కు ఈ మధ్య కాలంలో గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. కవిత కొత్త పార్టీ పెడతారన్న వార్తల నేపధ్యంలో కేటీఆర్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.