Latest

చైనా స్కూల్‌లో మ్యాజిక్: సైన్స్‌ను సింపుల్‌గా నేర్పించిన టీచర్స్!▶
Technology· 14 Apr 2026

చైనా స్కూల్‌లో మ్యాజిక్: సైన్స్‌ను సింపుల్‌గా నేర్పించిన టీచర్స్!

చైనాలోని ఒక స్కూల్‌లో ఇద్దరు టీచర్స్ సైన్స్‌ను ఎంతో క్రియేటివ్ గా టీచ్ చేసారు. సాధారణంగా కష్టంగా అనిపించే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి స్టూడెంట్స్‌కి ఈసీ గా అర్థమయ్యేలా ఒక ఫన్నీ గేమ్ ద్వారా నేర్పించారు. ఈ Innovation చూసి స్టూడెంట్స్ అందరూ excite అయ్యారు. క్లాస్ రూమ్ లో ఎప్పుడు బుక్స్ లో ఉన్నది బోర్డు మీద చెప్పడమే కాకుండా, ఇలాంటి ప్రాక్టికల్ ఆక్టివిటీస్ తో ఇంకా అర్దం అయ్యేలా నేర్పించవచ్చని ఈ టీచర్స్ మంచి ప్రయత్నం చేసారు.

మండిపోతున్న ఎండలు.. నిజామాబాద్ టాప్!
Health· 14 Apr 2026

మండిపోతున్న ఎండలు.. నిజామాబాద్ టాప్!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి! ఈరోజు నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4°C టెంపరేచర్ నమోదైంది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల బాడీ Dehydrate అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి క్కువ వాటర్ తాగుతూ, బాడీని Hydrated గా ఉంచుకోండి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

దొంగతనానికి వెళ్తే లోపలే చిక్కుకున్న దొంగలు!▶
Technology· 14 Apr 2026

దొంగతనానికి వెళ్తే లోపలే చిక్కుకున్న దొంగలు!

ఒక మొబైల్ షాపులో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగలకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వారు లోపల ఉండగానే ఎవరో బయట నుండి షూట్టర్ లాక్ చేసేశారు. ఇంకేముంది.. లోపలే ఉండిపోయిన దొంగలు బయటకు రావడానికి నానా తంటాలు పడ్డారు. దొంగతనం చేయడానికి వచ్చి, ఇప్పుడు తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.

213 కి.మీ. 2.5 గంటలు.. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
World· 14 Apr 2026

213 కి.మీ. 2.5 గంటలు.. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ వరకు నిర్మించిన ఎక్స్ ప్రెస్ వేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కి రోడ్డు మార్గంలో ఇప్పుడు 6 గంటల సమయం పడితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా దాదాపుగా 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లు కూడా ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య సుమారు 5 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆసియాలోనే అతిపెద్దదైన 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను నిర్మించడం విశేషం. ఇది రాజాజీ నేషనల్ పార్క్ గుండా వెళ్లే జంతువులకు రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి ఊతమిస్తుంది.

పెళ్లి కారుకు ఫ్రూట్స్ తో డెకరేషన్!▶
Entertainment· 14 Apr 2026

పెళ్లి కారుకు ఫ్రూట్స్ తో డెకరేషన్!

పెళ్లి కారు అంటే మనకు గుర్తొచ్చేది పూల తో చేసిన డెకరేషన్. కానీ ఈ వెడ్డింగ్ లో వీళ్ళు న్యూ ట్రెండ్ సెట్ చేసారు. కారును పూలకు బదులు రకరకాల పండ్లు మరియు స్నాక్స్ తో డెకరేట్ చేశారు. ఈ న్యూ ఐడియా చూసిన నెటిజన్లు పెళ్లి ఐపోయాక ఆ ఫ్రూట్స్ తినేయొచ్చు కూడా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం!▶
Crime· 14 Apr 2026

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం!

బీహార్‌లో ఒక వ్యక్తి అప్పుల భారం తట్టుకోలేక కోసి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న ఒక యువకుడు అతనికి నచ్చజెప్పి, ప్రాణాలని కాపాడాడు. ప్రభుత్వం అతని పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.

తన పింఛం తో థాంక్స్ చెప్పిన నెమలి!▶
Entertainment· 14 Apr 2026

తన పింఛం తో థాంక్స్ చెప్పిన నెమలి!

ప్రకృతికి మనం ప్రేమను అందిస్తే, అది మనకు అంతకంటే ఎక్కువే తిరిగి ఇస్తుంది. రీస్సెంన్ట్గా ఒక చిన్న అమ్మాయి నెమలికి ఎంతో ప్రేమతో గింజలను ఆహారంగా పెట్టింది. ఆ అమ్మాయి చూపించిన ప్రేమకు ఆ నెమలి, కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా తన అందమైన పింఛం విప్పి నాట్యం చేసింది. ఈ అద్భుతమైన విజువల్ చూస్తుంటే నెమలి థాంక్స్ చెప్తున్నట్టే ఉంది కదూ!

No Tax On Tips.. Trump వెరైటీ ప్రచారం ▶
World· 14 Apr 2026

No Tax On Tips.. Trump వెరైటీ ప్రచారం

“నో ట్యాక్స్ ఆన్ టిప్స్” పాలసీని ప్రమోట్ చేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త రూట్ ఎంచుకున్నారు. ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో McDonald’s డోర్ డెలివరీ ఆర్డర్ పెట్టి అందరినీ షాక్ కు గురి చేశారు. ఆ ఫుడ్ డెలివరీ తీసుకొచ్చిన ఆమెకి ట్రంప్ 100 డాలర్లు టిప్ గా ఇచ్చారు. ఆమె టిప్ ల ద్వారానే 11 వేల డాలర్లు సంపాదించిందట. పని చేసే వాళ్ళకి ఇచ్చే టిప్స్‌లో గవర్నమెంట్ వాటా ఎందుకు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మోనాలీసా భర్తకు ఊరట!
Politics· 14 Apr 2026

మోనాలీసా భర్తకు ఊరట!

మోనాలీసా భోగ్లే లవ్ మ్యారేజ్ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమె మైనర్ అని, ఇది 'లవ్ జిహాద్' అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. దీనిపై ఆమె భర్త మహమూద్ ఖాన్‌పై పోక్సో కేసు ఫైల్ అయింది. అయితే, ఇప్పుడు కేరళ హైకోర్టు అతనికి ఊరటనిస్తూ, ప్రెసెంట్ అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మలుపుతో ఈ కాన్ట్రొవర్శియల్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

  ఈ పండ్లతో హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?
Health· 14 Apr 2026

ఈ పండ్లతో హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

మనం కాంపౌండ్ వాల్ కు బదులు కంచెలా వేసుకునే నాగజెముడు మొక్కలలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని పళ్లు మంచి ఇమ్యూనిటీ బూస్టర్. సీ విటమిన్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు రావు. షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మన బాడీలో వాపు తగ్గిస్తుంది. మంచి స్కిన్ టోనర్ కూడా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదాని తెగ తినేయకండి.. మితంగానే తినాలి. కొందరికి ఈ పండు పడక పోవచ్చు కూడా..

హిస్టరీ మర్చిపోతే.. ఫ్యూచర్ ఉండదు
Politics· 14 Apr 2026

హిస్టరీ మర్చిపోతే.. ఫ్యూచర్ ఉండదు

ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి. ఆయన ఎన్నో విలువైన మాటలు చెప్పారు. చరిత్రని మర్చిపోయే వాళ్లు.. చరిత్రను సృష్టించలేరు అని అన్నారు. ఇది కేవలం కొటేషన్ కాదు. మనందరికీ ఒక వార్నింగ్. నిజంగా ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ ఈ తరం కచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్రను వక్రీకరిస్తూ, వాటి పేజీలను చించేయాలనుకునే పాలకులు ఉన్న ఈ టైమ్ లో అంబేద్కర్ మాటలు అందరూ గుర్తు చేసుకోవాలి. హిస్టరీని మర్చిపోవడం అంటే మనం చేసే పోరాటాల్ని కూడా మర్చిపోవడమే. అందుకే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం గతాన్ని గౌరవించాలి. అది కూడా సెలెక్టివ్ గా కాదు. నిజాయితీతో కూడిన హిస్టరీయే ఇంపార్టెంట్ . అది పాటిస్తేనే అంబేద్కర్ ఆశయాలు సాధించగలం.

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరి ? కాసేపట్లో నితీశ్ రాజీనామా
Politics· 14 Apr 2026

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరి ? కాసేపట్లో నితీశ్ రాజీనామా

బిహార్ కొత్త సీఎం రేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌధరి ముందున్నారు. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన ఈ రోజు రాజీనామా చేస్తున్నారు. నితీశ్ రాజీనామాతో బిహార్ లో ఒక శకం ముగిసిపోనుంది. సాయంత్రం 4 గంటలకి ఎన్డీయే భేటీలో కొత్త సీఎం ఎవరన్న దానిని నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సెంట్రల్ అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. సామ్రాట్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. రాష్ట్రంలో పవర్ పుల్ ఒబిసికి చెందిన కొయిరీ కులానికి చెందిన వ్యక్తి. 2023లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాడు. గత ఏడాది డీప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో కొత్త సీఎం, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ? ఈ సారి జెనీవాలో
World· 14 Apr 2026

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ? ఈ సారి జెనీవాలో

అమెరికా మరియు ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య గురువారం ఇస్లామాబాద్ లేదా జెనీవాలో చర్చలు జరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. అప్పటికి అమెరికా విధించిన కాల్పుల విరమణ గడువు కూడా ముగుస్తుంది. అందుకే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనని తొలగించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణు ఒప్పందం, ప్రాంతీయ భద్రతపై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. మరోవైపు ఇరాన్ తో చర్చల అంశం పూర్తిగా ఆ దేశం చేతుల్లో ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెంట్ చేశారు. Ball is in their court అని అన్నారు.

Health· 14 Apr 2026

మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా ? బీ కేర్ ఫుల్

పగలు పని చేయాలి. రాత్రి నిద్రపోవాలి. మన బయలాజికల్ క్లాక్ అప్పుడే సరిగ్గా పని చేస్తుంది. కానీ సాఫ్ట్ వేర్ రంగం విస్తరించాక యూత్ కి నైట్ డ్యూటీలు ఎక్కువైపోయాయి. అలాంటి వారందరూ ఆరోగ్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఏళ్ల తరబడి నైట్ డ్యూటీలు చేయడం వల్ల 77శాతం మందిలో షుగర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఉందని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి నిద్ర లేకపోతే హార్మోన్ల వ్యవస్థ ఛిన్నాభిన్నమై వారిలో మానసిక సమస్యలు కూడా రావొచ్చు. పగలు నిద్రపోవడం వల్ల సూర్యరశ్మి సోకక డీ విటమిన్ లోపాలు ఎదుర్కొంటున్నారు. నైట్ షిఫ్ట్ కంపల్సరీగా చేయాల్సిన వాళ్లు ముందుగా వైద్యుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యయనం వెల్లడించింది.

నాలుగుసార్లు ఆరెస్సెస్ ప్రోగ్రామ్ హాజరైన జడ్జి - కేజ్రివాల్
Local· 14 Apr 2026

నాలుగుసార్లు ఆరెస్సెస్ ప్రోగ్రామ్ హాజరైన జడ్జి - కేజ్రివాల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసుని విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మని ఆ కేసు నుంచి తప్పించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తన కేసుని తానే వాదించుకుంటున్న కేజ్రివాల్ గట్టిగా తన వాదనలు వినిపించారు. న్యాయమూర్తి RSS అనుబంధ సంస్థ అధివక్త పరిషత్ నిర్వహించిన ప్రోగ్రామ్స్ కి ఏకంగా నాలుగు సార్లు అటెండ్ అయ్యారని, ఒక specific Ideologyకి పరిమితమైన వాళ్ల దగ్గర న్యాయం ఎలా జరుగుతుందని కేజ్రివాల్ క్వశ్చన్ చేశారు. సీబీఐ ఈ వాదనను వ్యతిరేకించింది. వ్యక్తిగత భావజాలంతో సంబంధం లేకుండా జడ్జిలు పనిచేస్తారని వాదించింది.

 వారెవ్వా.. ఇరాన్.. వాట్  ఏ ప్లాన్?
World· 14 Apr 2026

వారెవ్వా.. ఇరాన్.. వాట్ ఏ ప్లాన్?

హర్మూజ్ ను బ్లాక్ చేసినా ఇరాన్ దాని ప్లాన్స్ లో అది ఉంది. అప్పటికే తన దగ్గరున్న చమురును సేఫ్ ప్లేస్ కి తరలించేంది. యుద్ధం ప్రారంభం కాకముందే రోజూ కంటే మూడు రెట్లు వేగంగా ట్యాంకర్లలో చమురును ఫిల్ చేసేసింది. మార్చి చివరి నాటికే దాదాపు 174 మిలియన్ బారెళ్ల చమురును సముద్రంలో ఫ్లోటింగ్ స్టోరేజ్ రూపంలో స్టోర్ చేసింది. ఇందులో 158 మిలియన్ బారెళ్ల ముడి చమురు, మిగిలినదంతా పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇరాన్ ను బ్లాక్ చేసినా ఈ చమురును ఎవరూ తాకలేరు. ఇవిమలేషియా తీరంలో జోహార్ దగ్గర ట్రాకింగ్ సిగ్నల్స్ ఆపేసి ఎవరికీ కనిపించకుండా చీకట్లో నడుస్తున్నాయి. డజన్ల కొద్దీ నౌకలు సీ రూట్ లో చైనాకు వెళుతున్నాయి.

హైడ్రాకు హైకోర్టు షాక్
Local· 14 Apr 2026

హైడ్రాకు హైకోర్టు షాక్

తెలంగాణలో అడ్డగోలుగా కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. GHMC, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధలనకు అనుగుణంగా ఈ కూల్చివేతలకు ఒక విధివిధానాలు, మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో కూల్చివేతల సమయంలో హైడ్రా అత్యుత్యాహంతో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించిదని, ఆ తీరు సమర్థనీయం కాదని అక్షింతలు వేసింది. కేసు విచారణని ఈ నెల 20కి వాయిదా వేసింది.

TGSRTCలో సమ్మె సైరన్
Local· 14 Apr 2026

TGSRTCలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకి వెళుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, చర్చలకు కూడా ఆర్టీసీ అధికారులు గైర్హాజరయ్యారని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, గత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణ బకాయిల అమలు, ఖాళీల భర్తీ, ఆర్టీసీ వాడుకున్న ఉద్యోగుల పీఎఫ్ తిరిగి వారి ఖాతాలో వేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి.

 ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ బూస్టర్ ..
Health· 14 Apr 2026

ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ బూస్టర్ ..

ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే ఈ నేచురల్ డ్రింక్ చాలా రుచికంగా ఉంటుంది దానితో పాటు ఆరోగ్యానికి బిగ్ బూస్ట్... తయారీ విధానం : 2–3 ఉసిరికాయలు (గింజలు తీసేయాలి), చిన్న అల్లం ముక్కతో కలిసి కొద్దిగా నీరు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడగట్టి, ఒక గ్లాసు నీరు కలిపి, తగినంత ప్యూర్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. మీకు ఐస్ ముక్కలు లభ్యమైతే అవి రెండుమూడు వేసుకోండి.

చుక్కలనంటుతున్న బ్రెంట్ క్రూడ్ ధర !!
World· 14 Apr 2026

చుక్కలనంటుతున్న బ్రెంట్ క్రూడ్ ధర !!

అమెరికా, ఇరాన్ మధ్య వివాదం ఇప్పుడు ముడి చమురు ధరలను ఆకాశానికి అంటుకునేలా చేస్తోంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా సంచలన ప్రకటన చేయడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో భయాందోళనలు టెన్షన్ మొదలయ్యింది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా వంద డాలర్లు దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఇది 150 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు క్రూడాయిల్ ధర పెరిగితే ఆటో మేటిగ్గా అన్ని ధరలూ పెరిగిపోతాయి. దీనికి తోడు గ్యాస్ సమస్య ఒకటి.. ప్రపంచ దేశాలు అందుకే ఆందోళన పడుతున్నాయి.

డార్క్ సర్కిల్స్ పోవాలంటే? ఈ 5 అలవాట్లు మార్చుకోండి!
Health· 13 Apr 2026

డార్క్ సర్కిల్స్ పోవాలంటే? ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే క్రీములతో పాట లైఫ్ స్టైల్ మారాలి. రోజూ 8 గంటల నిద్ర, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తాగుతూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఫోన్ స్క్రీన్ టైమ్ తగ్గించి కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మందు, సిగరేట్ లాంటి బాడ్ హాబిట్స్ స్కిన్ ని కరాబ్ చేస్తాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మంచి రిసల్ట్స్ కనిపిస్తాయి.