నిద్రపోతే 13.76 లక్షలిస్తారు..ఎక్కడంటే?

జపాన్‌లోని టోక్యోలో నిద్రపై ఓ వింత పోటీ నిర్వహించనున్నారు. ‘కోలా జపాన్’ సంస్థ ఈ పోటీని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేవారు 90 నిమిషాల పాటు నిద్రపోవాలి. నిద్ర ఎంత బాగా పట్టిందో ప్రత్యేక పరికరాలతో పరిశీలిస్తారు. పోటీ సమయంలో శబ్దాలు చేసినా, వాటిని పట్టించుకోకుండా బాగా నిద్రపోయేవారికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఈ పోటీలో గెలిచిన వారికి 22.2 లక్షల యెన్‌లు.. అంటే సుమారు 13.76 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు.


